News January 10, 2026

1.75కోట్ల ఇన్‌స్టా యూజర్ల డేటా లీక్?

image

ఇన్‌స్టాగ్రామ్ యూజర్లకు అలర్ట్. సుమారు 1.75 కోట్ల మంది యూజర్ల సెన్సిటివ్ డేటా లీక్ అయినట్లు సైబర్ నిపుణులు వెల్లడించారు. యూజర్ల పేర్లు, మెయిల్స్, ఫోన్ నంబర్లు, అడ్రెస్‌లు డార్క్ వెబ్‌లో అమ్మకానికి పెట్టినట్లు పేర్కొన్నారు. డేటా లీక్ వల్ల హ్యాకర్లు ఐడెంటిటీ థెఫ్ట్‌కు పాల్పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. యూజర్లు పాస్‌వర్డ్ మార్చుకోవాలని, ఇన్‌స్టా పేరుతో వస్తోన్న ఫేక్ మెయిల్స్ నమ్మొద్దని సూచించారు.

Similar News

News February 14, 2026

18 బంతుల్లోనే 50 రన్స్..

image

T20WCలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సౌతాఫ్రికా రికార్డు సృష్టించింది. అత్యంత వేగంగా(3 ఓవర్లు) 50 పరుగులు చేసిన రెండో టీమ్‌గా నిలిచింది. మార్క్రమ్ 14 బంతుల్లో 41, డికాక్ 4 బంతుల్లో 9 రన్స్ కొట్టారు. ఇందులో 7 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. 2016లో దక్షిణాఫ్రికాపై ఇంగ్లండ్ 2.5 ఓవర్లలోనే 50 బాదింది. కాగా ఇవాళ్టి మ్యాచ్‌లో SA పవర్ ప్లే ముగిసే సమయానికి 83/1 స్కోర్ చేసింది.

News February 14, 2026

40 కంపెనీల సీఈవోలు, 20 దేశాల లీడర్లతో మోదీ భేటీ

image

ఢిల్లీలో ఈ నెల 16 నుంచి 20 వరకు నిర్వహించనున్న AI Impact Summit కోసం కేంద్రం భారీ ప్రణాళికలు సిద్ధం చేసింది. ప్రధాని మోదీ 35-40 టాప్ కంపెనీల సీఈవోలు, 20 దేశాల లీడర్లతో భేటీ కానున్నారు. లిస్టులో ఓపెన్ ఏఐ, మైక్రోసాఫ్ట్, ఆంథ్రోపిక్, నెట్‌ఫ్లిక్స్, జూమ్, అమెజాన్ తదితర సంస్థలున్నాయి. దాదాపు $100 బిలియన్ల పెట్టుబడులు వస్తాయని అంచనా. పీపుల్-ప్లానెట్-ప్రోగ్రెస్ అంశాలపై ఈ సమ్మిట్ జరగనుంది.

News February 14, 2026

పార్టీల మధ్య ఆగని ‘వాలంటైన్స్ డే’ వార్

image

TG: ప్రేమికుల రోజు సందర్భంగా సోషల్ మీడియాలో పార్టీల వార్ ఆగడం లేదు. మధ్యాహ్నం ఒకరిపై ఒకరు చేసుకున్న ‘వాలంటైన్స్ డే’ విషెస్ విమర్శలు ఇప్పుడు తారస్థాయికి చేరాయి. ‘BRS loves modi more than TG’ అని కాంగ్రెస్ ట్వీట్ చేయగా ‘ఆయనకి ఇద్దరు’ పోస్టర్‌తో బీఆర్ఎస్, కాంగ్రెస్‌కు BJP కౌంటర్ ఇచ్చింది. ఇక ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’ పోస్టర్‌తో బీజేపీ, కాంగ్రెస్, MIMపై BRS సెటైర్లు వేసింది.