News June 28, 2024
1న ‘డబుల్ ఇస్మార్ట్’ ఫస్ట్ సింగిల్

పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో రామ్ పోతినేని నటిస్తున్న ‘డబుల్ ఇస్మార్ట్’ నుంచి ఫస్ట్ సింగిల్‌ను జులై 1న విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. స్టెప్ మార్ అంటూ సాగే ఈ పాట ప్రోమోను రేపు ఉ.11.02 గంటలకు రిలీజ్ చేస్తామంటూ ఓ పోస్టర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ చిత్రంలో సంజయ్ దత్ విలన్‌గా, కావ్యా థాపర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మూవీ ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Similar News
News November 27, 2025
30 రోజుల్లో 1400 భూకంపాలు

ఇండోనేషియాలో గత 30 రోజుల్లో 1,400కు పైగా భూకంపాలు రావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా సుమత్రా దీవిలో 6.3 తీవ్రతతో భూకంపం రాగా.. ఆషే ప్రావిన్స్ సమీపంలో 10 కి.మీ. లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఇప్పటికే సైక్లోన్ సెన్యార్ కారణంగా సుమత్రా దీవిలో ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడి 25 మంది మృతి చెందారు. ఇండోనేషియా పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్‌పై ఉండడం వల్ల తరచూ భూకంపాలు వస్తుంటాయి.
News November 27, 2025
స్మృతి మంధానకు మద్దతుగా నిలిచిన జెమీమా

తండ్రి అనారోగ్యంతో క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న స్మృతి మంధాన కోసం తోటి క్రికెటర్ జెమీమా రోడ్రిగ్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. స్మృతి ఫ్యామిలీకి మద్దతుగా నిలిచేందుకు బిగ్ బాష్ లీగ్ మిగతా మ్యాచ్‌లకు దూరం కానున్నారు. ఆమె ప్రాతినిధ్యం వహించే బ్రిస్బేన్ హీట్ ఈ విషయం వెల్లడించింది. స్మృతి పెళ్లి కోసం జెమీమా ఇండియాకు వచ్చారని, పెళ్లి ఆగిపోవడంతో ఫ్రెండ్‌కు సపోర్ట్ కోసం ఇక్కడే ఉంటానని తెలిపారని పేర్కొంది.
News November 27, 2025
NIT వరంగల్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు

<


