News December 3, 2024

ఈ నెలాఖరుకు లక్ష గృహ ప్రవేశాలు: అజయ్ జైన్

image

AP: గత ప్రభుత్వం ప్రారంభించిన గృహ సముదాయాలను త్వరగా పూర్తి చేయడంతోపాటు కొత్త ఇళ్లను నిర్మించేందుకు కూటమి సర్కార్ ప్రణాళికలు రూపొందించింది. ఇప్పటికే 7.5 లక్షల నిర్మాణాలు దాదాపు పూర్తయ్యాయని స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్ వెల్లడించారు. మరో 8 లక్షల ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. ఈ నెలాఖరుకు లక్ష మందితో సామూహిక గృహ ప్రవేశాలను సీఎం చంద్రబాబు ప్రారంభిస్తారని తెలిపారు.

Similar News

News December 10, 2025

VKB: మొదటి విడత పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్

image

వికారాబాద్ జిల్లాలో ఈనెల 11న జరగనున్న మొదటి విడత ఎన్నికల పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లో అధికారులతో ఎన్నికల నిర్వహణ, కౌంటింగ్‌పై ఆయన సమీక్షించారు. మొదటి విడతలో భాగంగా ఉదయం పోలింగ్ నిర్వహించి, మధ్యాహ్నం కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు ప్రకటించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

News December 10, 2025

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీలో ఉద్యోగాలు

image

<>నేషనల్ <<>>ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీలో 7 ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హతగల అభ్యర్థులు జనవరి 4 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిప్లొమా లేదా బీఎస్సీ లేదా ఇంజినీరింగ్ ఉత్తీర్ణులు అర్హులు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://nise.res.in/.

News December 10, 2025

నానో ఎరువులను ఎలా వాడాలి?

image

నానో యూరియా, DAPలను పైరుపై పిచికారీ పద్ధతిలోనే వాడాలి. వీటిని భూమిలో, డ్రిప్‌‌లలో వాడకూడదు. పంటలకు దుక్కిలో వ్యవసాయ నిపుణులు సిఫార్సు చేసిన ఎరువులను యథావిధిగా వేయాలి. పంటకు పైన ఎరువులను సిఫార్సు చేసినప్పుడు మాత్రం.. నానో ఎరువుల రూపంలో పిచికారీ చేసుకోవాలి. నానో యూరియా, DAPలను ఎకరాకు అర లీటరు(లీటరు నీటికి 4ml)చొప్పున పిచికారీ చేయాలి. తర్వాత సంప్రదాయ యూరియా, DAPలను పంటకు వేయనవసరం లేదు.