News March 22, 2025

1 స్కీమ్: ₹1.61LCR పెట్టుబడి, 11.5లక్షల జాబ్స్

image

PLI స్కీమ్స్‌తో ₹1.61L CR పెట్టుబడులు, ₹14L CR ప్రొడక్షన్, ₹5.31L CR ఎగుమతులు నమోదయ్యాయని కామర్స్ మినిస్ట్రీ ప్రకటించింది. ప్రత్యక్షంగా, పరోక్షంగా 11.5లక్షల ఉద్యోగాల సృష్టి జరిగిందని తెలిపింది. 14 రంగాల్లో 764 దరఖాస్తుల్ని ఆమోదించామని పేర్కొంది. బల్క్ డ్రగ్స్, మెడికల్ డివైజులు, ఫార్మా, టెలికం, వైట్ గూడ్స్, ఫుడ్ ప్రాసెసింగ్, టెక్స్‌టైల్స్, డ్రోన్స్ రంగాల్లో 176 MSMEలు లబ్ధి పొందాయని వెల్లడించింది.

Similar News

News January 8, 2026

ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం

image

దేశంలో తొలి వందే భారత్ స్లీపర్ ట్రైన్‌ను జనవరి 17న ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. గువాహటి-కోల్‌కతా రూట్‌లో 18 నుంచి పూర్తిస్థాయి సేవలు అందుబాటులోకి వస్తాయి. 16 కోచ్‌లు, 823 సీట్లు కలిగిన ఈ ట్రైన్‌లో విమాన తరహా సౌకర్యాలు, ఆటోమేటిక్ డోర్లు, మెరుగైన భద్రతా వ్యవస్థలు ఉన్నాయి. మధ్యతరగతి ప్రయాణికుల కోసం టికెట్ ధరలు రూ.2,300-3,600 మధ్య నిర్ణయించారు. గంటకు 180 KM వేగంతో దూసుకెళ్లనుంది.

News January 8, 2026

ధనుర్మాసం: ఇరవై నాలుగో రోజు కీర్తన

image

ఈ పాశురం కృష్ణుని గాథలు, గుణాన్ని కొనియాడుతోంది. రావణుని గెలిచిన రాముడికి, కృష్ణుడికి గోపికలు మంగళాశాసనాలు పలుకుతున్నారు. ‘గోవర్ధన గిరిని ఎత్తి గోకులాన్ని రక్షించిన నీ కరుణకు, శత్రువులను చెండాడు నీ సుదర్శన చక్రానికి జయం కలుగుగాక’ అని కీర్తిస్తున్నారు. ‘స్వామి! నీ వీరగాథలను స్తుతిస్తూ, మా నోముకు కావాల్సిన పరికరాలను ప్రసాదించి మమ్మల్ని అనుగ్రహించు’ అని గోపికలు వేడుకుంటున్నారు. <<-se>>#DHANURMASAM<<>>

News January 8, 2026

కృత్రిమ ఊపిరితిత్తులు.. IITH పరిశోధనలు

image

ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడుతున్న రోగులకు ఐఐటీ హైదరాబాద్ ఓ శుభవార్త అందించింది. కృత్రిమ ఊపిరితిత్తుల అభివృద్ధి దిశగా పరిశోధనలు చేస్తున్నట్లు తెలిపింది. జర్మనీకి చెందిన ఇన్‌స్టిట్యూట్ ఫర్ లంగ్ హెల్త్‌తో కలిసి ఈ పరిశోధనలు చేయనుంది. అవయవ మార్పిడి అవసరం లేకుండా శాశ్వత పరిష్కారం అందించడమే లక్ష్యంగా IIT హైదరాబాద్ పని చేస్తోంది. విజయవంతమైతే త్వరలోనే ఆర్టిఫీషియల్ లంగ్స్ అందుబాటులోకి రానున్నాయి.