News February 7, 2025
10న ఆల్బెండజోల్ మాత్రలను అందించండి: భద్రాద్రి కలెక్టర్

జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులను ఆదేశించారు. గురువారం ఐడీఓసీ కార్యాలయం సమావేశ మందిరంలో కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ నెల 10న నిర్వహించనున్న జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం రోజున 1 నుంచి 19 సంవత్సరాల వయసు గల వారందరికీ నులిపురుగులను నివారించే ఆల్బెండజోల్ మాత్రలను అందించాలన్నారు.
Similar News
News November 22, 2025
పార్లమెంటులో ‘అమరావతి’ బిల్లు: పెమ్మసాని

AP: రాష్ట్ర రాజధానిగా అమరావతిని గుర్తించే గెజిట్ ప్రక్రియ తుది దశకు చేరుకున్నట్లు కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉందన్నారు. CRDA కార్యాలయంలో మాట్లాడుతూ ‘రాజధాని రైతులకు 98% ప్లాట్ల పంపిణీ పూర్తయింది. మిగిలిన సమస్యలనూ త్వరలో పరిష్కరిస్తాం. రాబోయే 15ఏళ్లలో జనాభా పెరుగుదల అంచనాల ప్రకారం సదుపాయాలు కల్పిస్తాం’ అని వివరించారు.
News November 22, 2025
బిట్స్ పిలానీలో ఉద్యోగాలు

హైదరాబాద్లోని బిట్స్ పిలానీ 4 కేర్ టేకర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు ఈనెల 30 వరకు అప్లై చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://www.bits-pilani.ac.in/
News November 22, 2025
ADB: కారు జోరు.. కాంగ్రెస్ ఇలా.. బీజేపీ డీలా..!

రాష్ట్రంలో అన్ని ప్రధాన ఎన్నికల్లో ఓటమి చూసిన కారు పార్టీ ADBలో ఏమాత్రం జోరు తగ్గించడం లేదు. తరచూ వివిధ సమస్యలపై ఆందోళన నిర్వహిస్తూ ప్రజల్లో మద్దతు కూడగట్టుకుంటోంది. అభివృద్ధి తమ మంత్రమని కాంగ్రెస్ వివిధ పనులు చేస్తూ ముందుకు వెళ్తోంది. అధికార పార్టీ కార్యక్రమాలు అంతంతగానే ఉన్నాయి. ఇక బీజేపీ హిందుత్వపరంగా బలంగా ఉన్నా.. పార్టీ కార్యక్రమాలు అంతగా కనిపించడం లేదని రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తోంది.


