News February 6, 2025

10న ఆల్బెండజోల్ మాత్రలను అందించండి: భద్రాద్రి కలెక్టర్

image

జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్‌ వి పాటిల్ అధికారులను ఆదేశించారు. గురువారం ఐడీఓసీ కార్యాలయం సమావేశ మందిరంలో కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ నెల 10న నిర్వహించనున్న జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం రోజున 1 నుంచి 19 సంవత్సరాల వయసు గల వారందరికీ నులిపురుగులను నివారించే ఆల్బెండజోల్ మాత్రలను అందించాలన్నారు.

Similar News

News March 5, 2026

పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ రాజమండ్రికి తరలింపు

image

పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ(PPA) కార్యాలయాన్ని హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరానికి తరలించాలని కేంద్ర జలశక్తి శాఖ గురువారం ఆదేశాలు జారీ చేసింది. ప్రాజెక్ట్ పర్యవేక్షణను సమర్దవంతంగా నిర్వహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో వేగవంతమైన పర్యవేక్షణ, కార్యాలయం దగ్గరగా ఉండటం వల్ల పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షించడం సులభమవుతుంది. ముంపు సమస్యలను ప్రజలు అధికారుల దృష్టికి నేరుగా తీసుకెళ్లవచ్చు.

News March 5, 2026

సుఖోయ్ యుద్ధ విమానం మిస్సింగ్!

image

అస్సాంలో సుఖోయ్ Su-30 MKI యుద్ధ విమానం గల్లంతయింది. జోర్హాట్ నుంచి టేకాఫ్ అయిన జెట్ 7.42PM సమయంలో రాడార్ నుంచి కాంటాక్ట్ కోల్పోయింది. పైలట్ కూడా మిస్ అయినట్లు రక్షణ శాఖ అధికారులు చెప్పారు. IAF సెర్చ్, రెస్క్యూ ఆపరేషన్ చేపట్టినట్లు తెలిపారు. అయితే ఫైటర్ జెట్ కూలిపోయిందని వార్తలు వస్తున్నాయి.

News March 5, 2026

3 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్

image

T20WC: 254 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ తడబడుతోంది. 6 ఓవర్లలో 68 రన్స్ చేసి 3 వికెట్లు కోల్పోయింది. సాల్ట్ 5, బట్లర్ 25, బ్రూక్ 7 రన్స్ చేసి ఔటయ్యారు. బెథెల్ (26*), బాంటన్ (4*) క్రీజులో ఉన్నారు. ఇంగ్లండ్ విజయానికి 84 బంతుల్లో 186 రన్స్ కావాలి. మరి ఈ మ్యాచులో ఎవరు గెలుస్తారో కామెంట్ చేయండి.