News July 8, 2025
10న చిత్తూరు జిల్లాలో PTM

చిత్తూరు జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో మెగా పేరెంట్-టీచర్ సమావేశం(PTM) ఈనెల 10న ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో విద్యాశాఖ అధికారులు, వివిధ పాఠశాల యాజమాన్యాలతో ఆయన చర్చించారు. తల్లిదండ్రులకు వారి పిల్లల సమగ్ర నివేదికను అందజేయాలన్నారు. తల్లి పేరుతో మొక్క నాటాలని సూచించారు.
Similar News
News August 31, 2025
చిత్తూరు జిల్లాలో చికెన్ ధరలు ఇలా..

చిత్తూరు జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. పలు దుకాణాల్లో బ్రాయిలర్ కోడి కిలో రూ.122, మాంసం రూ.177 పలుకుతోంది. స్కిన్ లెస్ రూ.201 వరకు విక్రయిస్తున్నారు. లేయర్ మాంసం కిలో రూ.200 చొప్పున అమ్ముతున్నారు. మరోవైపు కేజీ మటన్ రూ.800 నుంచి రూ. 900 మధ్య ఉంది. మీ ఏరియాలో మాంసం ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.
News August 31, 2025
కుప్పంలో బుల్లెట్ బైక్ నడిపిన మంత్రి నిమ్మల

కుప్పంలో శనివారం మంత్రి నిమ్మల రామానాయుడు బుల్లెట్ బైక్‌పై సీఎం బహిరంగ సమావేశానికి హాజరయ్యారు. పరమసముద్రం వద్ద హంద్రీనీవా జలాలకు సీఎం జల హారతి ఇచ్చే బహిరంగ సభకు వెళ్లగా.. మంత్రి నిమ్మల బుల్లెట్ బైక్‌పై ఈ సమావేశానికి వచ్చారు. టీడీపీ శ్రేణులకు అభివాదం ఆయన చేశారు.
News August 31, 2025
కాణిపాకం బ్రహ్మోత్సవాలలో నేడు..

కాణిపాకం వరసిద్ధి వినాయస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం స్వామి వారు చిన్న, పెద్ద శేషవాహనాల్లో విహరించనున్నారు. ఈ సేవకు ఉభయకర్తలుగా కాణిపాకం, కాకర్లవారిపల్లె, వడ్రాంపల్లె, మిట్టిండ్లు, కొత్తపల్లె, అడపగుండ్ల పల్లె, 44 బొమ్మసముద్రం, తిమ్మోజిపల్లి, తిరువణంపల్లి, చిగరపల్లి, అగరంపల్లి గ్రామాల్లోని కమ్మ వంశస్తులు వ్యవహరించనున్నారని ఆలయాధికారులు తెలిపారు.