News February 3, 2025
10న జాతీయ నూలి పురుగుల నిర్మూలన కార్యక్రమం: కలెక్టర్

జాతీయ నూలి పురుగుల దినోత్సవం సందర్భంగా ఈ నెల 10న మొదటి దశ జాతీయ నూలి పురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ పేర్కొన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లో జాతీయ నూలి పురుగుల నిర్మూలన కార్యక్రమ నిర్వహణపై జిల్లా స్థాయి అధికారులతో టాస్క్ ఫోర్స్ సమావేశాన్ని నిర్వహించారు.
Similar News
News December 2, 2025
రేపు ప్రధాని మోదీతో సీఎం రేవంత్ భేటీ

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. రేపు ఉదయం 11 గంటలకు ఆయన ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. పార్లమెంట్ భవనంలోనే పీఎంతో సమావేశమై తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు ఆహ్వానించనున్నారు. అలాగే పలువురు కేంద్రమంత్రులను సైతం రేవంత్ కలిసి సదస్సుకు ఇన్వైట్ చేయనున్నారు.
News December 2, 2025
NGKL:జర్నలిస్టుల మహాధర్నాను విజయవంతం చేయాలి

జర్నలిస్టుల సమస్యలపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఖండిస్తూ DEC 3న HYD I&PR కమిషనర్ కార్యాలయం వద్ద TUWJ(IJU) ఆధ్వర్యంలో జరిగే మహాధర్నాను విజయవంతం చేయాలని టెమా పాలమూరు జిల్లా కన్వీనర్ అహ్మద్ పాష పిలుపునిచ్చారు. అక్రిడిటేషన్ కార్డులు, హెల్త్ కార్డుల జారీపై ప్రభుత్వం కాలయాపన చేస్తోందన్నారు. అక్రిడిటేషన్ పాలసీ ప్రకటించి కొత్త కార్డులు జారీ చేయాలని, ఆరోగ్య బీమా పథకాన్ని పునరుద్ధరించాలని అన్నారు
News December 2, 2025
శ్రీలంకకు భారత్ సాయం.. కృతజ్ఞతలు చెప్పిన జయసూర్య

‘దిత్వా’ తుఫాను బీభత్సానికి తీవ్రంగా నష్టపోతున్న శ్రీలంకకు <<18427442>>భారత్ సాయం<<>> అందిస్తోంది. ఈ సందర్భంగా ఆ దేశ క్రికెట్ జట్టు కోచ్ సనత్ జయసూర్య భారత ప్రజలు, PM మోదీ, కేంద్ర మంత్రి జై శంకర్కు కృతజ్ఞతలు చెబుతూ ట్వీట్ చేశారు. ‘క్లిష్ట సమయంలో SLకు అండగా నిలిచినందుకు ధన్యవాదాలు. ఆర్థిక సంక్షోభ సమయంలో ఆదుకున్నట్లుగానే ఇప్పుడూ మద్దతునిస్తున్నారు. ఇరుదేశాల మధ్య బలమైన స్నేహానికి ఇదే నిదర్శనం’ అని పేర్కొన్నారు.


