News February 3, 2025
10న జాతీయ నూలి పురుగుల నిర్మూలన కార్యక్రమం: కలెక్టర్

జాతీయ నూలి పురుగుల దినోత్సవం సందర్భంగా ఈ నెల 10న మొదటి దశ జాతీయ నూలి పురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ పేర్కొన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లో జాతీయ నూలి పురుగుల నిర్మూలన కార్యక్రమ నిర్వహణపై జిల్లా స్థాయి అధికారులతో టాస్క్ ఫోర్స్ సమావేశాన్ని నిర్వహించారు.
Similar News
News February 19, 2025
మెగా జాబ్ మేళా గోడపత్రికను ఆవిష్కరించిన కలెక్టర్

ఒంగోలులోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో బుధవారం మెగా జాబ్ మేళాకు సంబంధించిన ప్రచార గోడపత్రికలను జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆవిష్కరించారు. ఈ నెల 22వ తేదీన కంభం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మెగా జాబ్ మేళాను ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా, ఉపాధి కార్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నిరుద్యోగ యువత జాబ్ మేళాను వినియోగించుకోవాలని తెలిపారు.
News February 19, 2025
కామారెడ్డి: పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి:విద్యాశాఖ కమిషనర్

ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ఇంటర్ ఇంటర్ విద్యాశాఖ కమిషనర్ కృష్ణ ఆదిత్య చెప్పారు. బుధవారం కామారెడ్డి జిల్లా ఇంటర్ విద్యాశాఖ కార్యాలయానికి ఆయన వచ్చారు. ఈ సందర్భంగా జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి షేక్ సలాం ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ.. పరీక్షా కేంద్రాలలో సీసీ కెమెరాలు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
News February 19, 2025
ఢిల్లీ సీఎం ఎంపికపై ఉత్కంఠ

ఢిల్లీ కొత్త సీఎం ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది. బీజేపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నేతలు, కేంద్ర పరిశీలకులు భేటీ అయ్యారు. కాసేపట్లో ఢిల్లీ బీజేపీ శాసనసభాపక్ష నేతను ఎన్నుకోనున్నారు. కొత్త సీఎం రేపు ప్రమాణస్వీకారం చేయనున్నారు.