News February 6, 2025

10న నులి పురుగుల నిర్మూల‌న కార్య‌క్ర‌మం: కలెక్టర్

image

జాతీయ నులి పురుగుల నిర్మూల‌న కార్య‌క్ర‌మంలో భాగంగా ఈ నెల 10వ తేదీన అల్బెండ‌జోల్ మాత్ర‌ల పంపిణీ కార్య‌క్ర‌మాన్ని ప‌క‌డ్బందీగా నిర్వ‌హించాల‌న్నారు. వివిధ శాఖ‌ల అధికారులు స‌మ‌ష్టి కృషితో కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేయాల‌ని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ ఆదేశించారు. గురువారం క‌లెక్ట‌రేట్‌లో జాతీయ నులి పురుగుల నిర్మూల‌న కార్య‌క్ర‌మానికి సంబంధించిన గోడ ప‌త్రిక‌లు, క‌ర‌ప‌త్రాల‌ను ఆవిష్క‌రించారు.

Similar News

News January 22, 2026

NRPT: నేడు డయల్ యువర్ డీఎం: లావణ్య

image

నారాయణపేట, కోస్గి ఆర్టీసీ డిపో పరిధిలోని ప్రయాణికులు తమ సమస్యలు, సలహాలు, సూచనలను స్వీకరించేందుకు గాను నేటి గురువారం డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు డిపో మేనేజర్ లావణ్య తెలిపారు. ప్రయాణికులు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 7382826293 నంబర్‌కు ఫోన్ చేసి సద్వినియోగం చేసుకోగలరని కోరారు. మరి మీ గ్రామాలకు ఆర్టీసీ అధికారులు బస్సులను నడుపుతున్నారా లేదా కామెంట్ చేయండి.

News January 22, 2026

విజయనగరం జిల్లాలో కానిస్టేబుల్ మృతి

image

గజపతినగరం మండలం ముచ్చెర్ల వద్ద రోడ్డు ప్రమాదానికి గురైన సివిల్ కానిస్టేబుల్ టి.తిరుపతిరావు కన్నుమూశారు. జనవరి 14న విధులు ముగించుకొని వస్తుండగా ప్రమాదం జరగ్గా.. విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి ఆయన మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. దీంతో పోలీసు శాఖలో విషాదం నెలకొంది. ఆయన మృతికి పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

News January 22, 2026

అరసవెల్లి రథసప్తమి ఉత్సవాలలో నేటి కార్యక్రమాలు.!

image

అరసవెల్లిలో సప్తాహ్ ఉత్సవాల్లో భాగంగా నేడు వివిధ ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అరసవెల్లి ఆలయంలో ఉత్సవ మూర్తులకు లక్ష పుష్పార్చన సేవ జరగనుంది. డచ్ బంగ్లా వద్ద ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు హెలీ రైడ్, బెలూన్ రైడ్‌లు ఏర్పాటు చేశారు. కేఆర్ స్టేడియంలో సాయంత్రం ఫుడ్ ఎగ్జిబిషన్, కిడ్స్ ప్లే, నృత్యాలు, మిమిక్రీ, గోరటి వెంకన్న కార్యక్రమంల ‘శ్రీనివాస కళ్యాణం’నాటిక జరుగుతుంది.