News February 7, 2025
10న శ్రీశైలానికి మంత్రులు

శ్రీశైల క్షేత్రంలో ఫిబ్రవరి 19 నుంచి మార్చి 1 వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ నెల 23న సీఎం చంద్రబాబు శ్రీశైలానికి రానున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 10న పలువురు మంత్రులు క్షేత్రానికి చేరుకుని ఏర్పాట్లను పరిశీలించనున్నారు. మంత్రులు పయ్యావుల కేశవ్, ఆనం రామనారాయణరెడ్డి, ఎన్ఎండీ ఫరూక్, అనిత, అనగాని సత్యప్రసాద్, అలాగే నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి, స్థానిక ఎమ్మెల్యే బుడ్డా ఏర్పాట్లు పరిశీలిస్తారు.
Similar News
News November 25, 2025
తగ్గిన చమురు దిగుమతులు.. డిస్కౌంట్స్ ఇస్తున్న రష్యా కంపెనీలు

అమెరికా ఆంక్షల కారణంగా కొనుగోళ్లు పడిపోవడంతో రష్యా చమురు కంపెనీలు భారీగా రాయితీలు ఇస్తున్నాయి. జనవరికి డెలివరీ అయ్యే ఒక్కో బ్యారెల్ చమురుపై 7 డాలర్ల వరకు డిస్కౌంట్స్ ఆఫర్ చేస్తున్నాయి. రష్యా చమురు సంస్థలు రాస్నెఫ్ట్, ల్యూకోయిల్పై అమెరికా, యూరోపియన్ యూనియన్ ఆంక్షలు విధించాయి. మరోవైపు, ఆ దేశం నుంచి కొనుగోళ్లు వద్దంటూ ఒత్తిడి చేస్తుండడంతో భారత రిఫైనరీలూ దిగుమతులు తగ్గించిన సంగతి తెలిసిందే.
News November 25, 2025
VJA: భవానీలకు ఉచిత బస్సులు.. వసతుల కల్పనకు చర్యలు.!

విజయవాడ దుర్గమ్మ ఆలయానికి డిసెంబర్ 11 నుంచి 15 వరకు భవానీలు మాలవిరమణకు రానున్నారు. ఈ ఏడాది ఆరు లక్షల మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారని అంచనా. ఏర్పాట్లలో భాగంగా బస్టాండ్, రైల్వే స్టేషన్ల నుంచి భక్తుల కోసం 17 ఉచిత బస్సులు ఏర్పాటు చేశారు. వాటర్ బాటిళ్లు, క్లోరినేషన్, కేశఖండనశాలలో సిబ్బంది, ఉచిత ప్రసాదాల పంపిణీ వంటి సదుపాయాలు కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
News November 25, 2025
యాదాద్రీశుడి హుండీలో 20 దేశాల కరెన్సీ

యాదాద్రి శ్రీవారి దేవస్థానం హుండీ ఆదాయం సోమవారం లెక్కించారు. 20 దేశాల కరెన్సీ స్వామి వారి ఖజానాకు సమకూరినట్లు EO వెంకట్రావు తెలిపారు. అమెరికా 2,014, ఆస్ట్రేలియా 75, ఇంగ్లండ్ 65, సౌదీ అరేబియా 61, ఒమన్ 2, మలేషియా 51, యూరో 15, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 970, కెనడా 1245, న్యూజిలాండ్ 95, శ్రీలంక 500, బహ్రెయిన్ 2, అరబ్ ఎమిరేట్స్ 70, సింగపూర్ 41, ఖతార్ 318, చైనా 20 తదితర దేశాల కరెన్సీ నోట్లు వచ్చాయన్నారు.


