News February 7, 2025
10న శ్రీశైలానికి మంత్రులు

శ్రీశైల క్షేత్రంలో ఫిబ్రవరి 19 నుంచి మార్చి 1 వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ నెల 23న సీఎం చంద్రబాబు శ్రీశైలానికి రానున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 10న పలువురు మంత్రులు క్షేత్రానికి చేరుకుని ఏర్పాట్లను పరిశీలించనున్నారు. మంత్రులు పయ్యావుల కేశవ్, ఆనం రామనారాయణరెడ్డి, ఎన్ఎండీ ఫరూక్, అనిత, అనగాని సత్యప్రసాద్, అలాగే నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి, స్థానిక ఎమ్మెల్యే బుడ్డా ఏర్పాట్లు పరిశీలిస్తారు.
Similar News
News March 21, 2025
మెగాస్టార్ చిరంజీవికి సీఎం రేవంత్ అభినందనలు

TG: UKలో జీవన సాఫల్య పురస్కారం అందుకున్న మెగాస్టార్ చిరంజీవిని CM రేవంత్ అభినందించారు. ‘లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు అందుకున్న ప్రముఖ నటుడు చిరంజీవిగారికి హృదయపూర్వక అభినందనలు. మీకు లభించిన ఈ గౌరవం తెలుగుజాతికి గర్వకారణం. భవిష్యత్తులో మీరు మరిన్ని శిఖరాలను అధిరోహించాలని, తెలుగు ప్రజల కీర్తి ప్రతిష్ఠలను విశ్వవేదికపై చాటిచెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అని ట్వీట్ చేశారు.
News March 21, 2025
HYD: ఓయూ సర్కులర్‌పై హైకోర్టు స్టే

ఓయూ జారీ చేసిన సర్క్యులర్ మీద హైకోర్ట్ స్టే ఇచ్చింది. ఓయూ పరిధిలో ధర్నాలు, నిరసనలు బ్యాన్ చేస్తూ ఓయూ అధికారులు ఈ నెల 13వ తేదిన ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు చట్ట విరుద్ధమని రఫీ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి, ఓయూ రిజిస్ట్రార్‌కు నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను కోర్టు ఏప్రిల్ 9కి వాయిదా వేసింది.
News March 21, 2025
సంగారెడ్డి: రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు: కలెక్టర్

జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు సమగ్ర చర్యలు చేపట్టాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి సంబంధిత అధికారులకు ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో గురువారం సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. టూ వీలర్ వాహనదారులు హెల్మెట్ ధరించే విధంగా చర్యలు చేపట్టాలని ఆర్టీవో, పోలీస్ అధికారులకు సూచించారు. అధికంగా ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో గుర్తించి బ్లాక్ స్పాట్లుగా నమోదు చేయాలని తెలిపారు.