News March 29, 2024
10రోజుల కిందే కూతురు పెళ్లి.. అంతలోనే పెనువిషాదం

కుటుంబ కలహాలు ఓ ఇంట విషాదాన్ని నింపాయి. ఉండ్రాజవరానికి చెందిన వెంకట్(40)- పార్వతికి 20ఏళ్ల కింద పెళ్లైంది. కొడుకు, కుమార్తె సంతానం. గొడవలతో దూరంగా ఉంటున్న వీరిద్దరూ 10రోజుల కిందే కుమార్తె పెళ్లి చేశారు. రెండ్రోజుల కింద వెంకట్.. తాడేపల్లిగూడెంలోని పార్వతి ఇంటికి రాగా గొడవ జరిగింది. వెంకట్ కత్తితో కొడుకును పొడవగా.. పార్వతి భర్త తలపై ఇటుకతో కొట్టింది. ఇద్దరినీ ఆసుపత్రికి తరలించగా.. వెంకట్ మరణించాడు.
Similar News
News October 30, 2025
ధవళేశ్వరం: 94 వేల క్యూసెక్కుల మిగులు జలాలు విడుదల

మొంథా తుఫాన్ నేపథ్యంలో కురుస్తున్న వర్షాల కారణంగా, ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద నీటిమట్టం 10.90 అడుగులకు చేరింది. దీంతో బుధవారం సాయంత్రం 94,122 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేశారు. ముందస్తు చర్యలో భాగంగా, తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టా కాలువలకు నీటి విడుదలను అధికారులు నిలిపివేశారు.
News October 28, 2025
తుఫాన్ చర్యలపై రాజమండ్రి MP ఆరా

తుఫాను నేపథ్యంలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ప్రభుత్వం అన్ని రకాల ముందస్తు చర్యలు తీసుకుందని రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి తెలిపారు. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనడానికి ఆమె అమెరికా వెళ్లారు. తుపాన్ పరిస్థితులపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. జిల్లా అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
News October 28, 2025
తూ.గో: పునరావాస కేంద్రాలకు 361 కుటుంబాల తరలింపు

తుఫాను నేపథ్యంలో తూ.గో జిల్లా వ్యాప్తంగా 361 కుటుంబాలు, 1193 మందిని పునరావాస కేంద్రాలకు తరలించామని కలెక్టర్ కీర్తి చేకూరి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. తుఫాను ప్రభావం ఎక్కువగా ఉన్న మండలాల్లో అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉంటున్నారని చెప్పారు. శిబిరాల్లో తాగునీరు, ఆహారం, వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు.


