News February 13, 2026

10వేల కండోమ్స్ 3 రోజుల్లో ఖతం

image

శీతాకాల ఒలింపిక్స్-2026లో కండోమ్స్ కొరత ఏర్పడింది. 2900 మంది అథ్లెట్స్ కోసం 10వేల ప్యాకెట్లను సిద్ధం చేయగా 3 రోజుల్లోనే షెల్ఫులు ఖాళీ అయ్యాయి. ఈ ఊహించని పరిణామంతో, విమర్శలు రాకుండా వెంటనే స్టాక్ తెప్పిస్తున్నట్లు ఇటలీ అధికారులు వెల్లడించారు. ఆరోగ్యకర లైఫ్‌ను ప్రోత్సహించేలా ఒలింపిక్స్‌లో చాలా ఏళ్లుగా గర్భ నిరోధకాలు అందిస్తున్నారు. కరోనా సమయంలో మాత్రం వీటికి బ్రేక్ పడింది.

Similar News

News March 12, 2026

ఇండక్షన్ స్టవ్ కోసం చూస్తున్నారా?

image

వంటగ్యాస్ కొరతతో చాలా మంది ఇండక్షన్ స్టవ్‌లు కొనుగోలు చేస్తున్నారు. ఇవి విద్యుదయస్కాంత శక్తితో పని చేస్తాయి. దానిపై ఉన్న కాపర్ కాయిల్ ద్వారా విద్యుత్ ప్రవహించినప్పుడు అయస్కాంత క్షేత్రం ఏర్పడి పాత్ర వేడెక్కుతుంది. అయితే ఈ స్టవ్‌పై అన్ని రకాల పాత్రలు పని చేయవు. ఇండక్షన్ బేస్ ఉన్న స్టెయిన్ లెస్ స్టీల్ పాత్రలు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఈ స్టవ్ ధరలు రూ.1,200-రూ.5,000 వరకు ఉంటాయి.

News March 12, 2026

పాపం జెన్‌జీలు

image

జెన్‌జీల జీవితం ఎమోషనల్ మూవీని తలపిస్తోంది. చదువుకోవాల్సిన సమయంలో కొవిడ్ లాక్డౌన్లు అడ్డుపడగా.. కెరీర్ మొదలుపెట్టే వేళ AI సవాలు విసురుతోంది. ఆర్థిక మాంద్యం, పెరిగిన ధరలతో సొంత ఇల్లు కలగానే మిగిలిపోతోంది. ఇక పెళ్లి చేసుకుందామంటే పెరుగుతున్న విడాకుల శాతం భయపెడుతోంది. అటు కెరీర్ టెన్షన్లు, ఇటు సామాజిక ఒత్తిళ్లతో ఈ తరం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. వీరి పరిస్థితి ‘ముందు నుయ్యి.. వెనుక గొయ్యి’లా మారింది.

News March 12, 2026

PHOTO: నాగచైతన్య సిక్స్‌ప్యాక్‌

image

అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం ‘వృషకర్మ’. ఈ సినిమాలో ‘అర్జున్’ అనే పవర్‌ఫుల్ పాత్ర కోసం చైతూ తన బాడీని పూర్తిగా మార్చేశారు. తాజాగా ఆయన జిమ్‌లో కసరత్తులు చేస్తున్న షర్ట్‌లెస్ ఫొటో వైరల్ అవుతోంది. కార్తీక్ దండు దర్శకత్వంలో హారర్, మైథలాజికల్ అంశాలతో వస్తున్న ఈ సినిమా గ్లింప్స్ ఇప్పటికే అంచనాలు పెంచేశాయి. ‘చైతూ పడ్డ కష్టానికి ఈ సారి హిట్ పక్కా’ అని ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు.