News February 17, 2025

10వ తరగతి పరీక్షలపై డివిజన్ స్థాయిలో సమీక్ష

image

10వ తరగతి పరీక్షలపై 19, 20 తేదీల్లో డివిజన్ స్థాయిలో సమీక్ష నిర్వహించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి బాలాజీ రావు ఒక ప్రకటనలో తెలిపారు. మార్చి నెలలో జరగనున్న 10వ తరగతి పరీక్షలపై 19 వ తేదీన కందుకూరు, కావలి డివిజన్లకు, 20వ తేదీన నెల్లూరు, ఆత్మకూరు డివిజన్లకు ఆయా ప్రాంతాల్లో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి డిపార్ట్మెంటల్‌, చీఫ్ అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలన్నారు.

Similar News

News November 23, 2025

కోటంరెడ్డితో మంత్రి పొంగూరు నారాయణ భేటీ

image

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో మంత్రి పొంగూరు నారాయణ ఆదివారం ఉదయం భేటీ అయ్యారు. మాగుంట లేఔట్‌లోని కోటంరెడ్డి కార్యాలయానికి నారాయణ వచ్చారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి ఆయనకు ఆత్మీయ స్వాగతం పలికారు. మేయర్ స్రవంతిపై అవిశ్వాస తీర్మానం పెడతారన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వీరిద్దరి భేటీ రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.

News November 23, 2025

నెల్లూరు: దీపావళి స్కీం పేరుతో రూ.73 లక్షలు టోకరా..?

image

కనకదుర్గమ్మ దీపావళి ఫండ్స్ స్కీం పేరుతో విలువైన వస్తువులు, బంగారు ఇస్తామని ఆశ చూపి సుమారు రూ.73 లక్షల మేర టోకరా వేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. గూడూరుకు చెందిన ప్రసాద్, పద్మావతి దంపతులు 3 రకాల స్కీముల పేరుతో నెలకు రూ.350, రూ.400, రూ.1200 చెల్లిస్తే కంచు బిందెతోపాటు, 20 రకాల విలువైన వస్తువులు ఇస్తామని నమ్మబలికారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో డబ్బులు వసూలు చేసి ఉడాయించడంతో మనుబోలు పోలీసులను ఆశ్రయించారు.

News November 23, 2025

కావలి: రైలు కింద పడి యువకుడి దుర్మరణం

image

కావలి జీఆర్‌పీ పోలీస్ స్టేషన్ పరిధిలో కొడవలూరు రైల్వే స్టేషన్ వద్ద సుమారు 20-25 ఏళ్ల వయసు గల యువకుడు రైలు కింద పడి దుర్మరణం చెందాడు. యువకుడు ఆరంజ్ కలర్ హాఫ్ హ్యాండ్ T షర్ట్, బ్లూ కలర్ కట్ బనియన్, బ్లూ కలర్ షార్ట్ ధరించి ఉన్నాడు. ఆచూకీ తెలిసినవారు కావలి జీఆర్‌పీ పోలీసులను సంప్రదించగలరు.