News March 1, 2025

10వ తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్

image

జిల్లాలో మార్చి 21 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు జరగనున్న 10వ తరగతి వార్షీక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. శుక్రవారం ASF కలెక్టర్ సమావేశ మందిరంలో ఇన్చార్జి జిల్లా విద్యాశాఖ అధికారి యాదయ్యతో కలిసి పోలీస్, రెవెన్యూ, విద్యా, గిరిజన, షెడ్యూల్డ్ కులాలు, వెనుకబడిన తరగతులు, మైనారిటీ, రవాణా, వైద్య ఆరోగ్య అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

Similar News

News December 8, 2025

పాలమూరు: ఓటు గోప్యం.. వెల్లడిస్తే నేరం..!

image

పోలింగ్ బూత్‌కు వెళ్లి ఓటు వేసి వచ్చిన తర్వాత ఏ అభ్యర్థికి ఓటు వేశారో అనే విషయాన్ని గోప్యంగా ఉంచాలని ఎన్నికల కమిషన్ హెచ్చరించింది. ఓటు హక్కును వినియోగించుకునే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద ఓటు వేసే పద్ధతిని పాటించకపోతే ఎన్నికల నియమావళి 49ఏ ప్రకారం ఓటు వేయనీయరు. పోలింగ్ కేంద్రాల్లో అనుచిత ప్రవర్తనకు పాల్పడితే చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటారు. # SHARE IT

News December 8, 2025

కేతేపల్లి: మూడుసార్లు సస్పెండ్.. సతీమణికి సర్పంచ్ టికెట్

image

కేతేపల్లి మండలం చెర్కుపల్లి గ్రామానికి చెందిన చిన్నబొస్క ప్రసాద్ గతంలో పలు కారణాలపై మూడుసార్లు (మొత్తం 18 నెలలు) సర్పంచ్‌ పదవి నుంచి సస్పెండ్‌ అయ్యారు. గ్రామ సభలు పెట్టలేదని, ముగ్గురు పిల్లలు ఉన్నారని, ఉప సర్పంచ్‌ సంతకం ఫోర్జరీ చేశారని ఆయనపై చర్యలు తీసుకున్నారు. ఈసారి జనరల్ మహిళకు రిజర్వేషన్ రావడంతో, ప్రసాద్ సతీమణి చిన్నబొస్క శైలజ సర్పంచ్ ఎన్నికల బరిలో నిలిచారు.

News December 8, 2025

ఆదిలాబాద్: ఎన్నికల బరిలో వింత పోకడలు

image

పంచాయతీ ఎన్నికల్లో భిన్న పరిస్థితులు నెలకొంటున్నాయి. తాము సర్పంచిగా గెలవాలని అభ్యర్థులు వివిధ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికీ రెండో విడత నామినేషన్ల ఉపసంహరణ పూర్తయింది. అభ్యర్థులు తమకు పోటీగా ఉన్న వారికి వేరేరకంగా మేలు చేస్తామని ఒప్పించి నామినేషన్లు ఉపసంహరించుకునేలా చేశారు. 3వ విడతలోనూ నామినేషన్ల ఉపసంహరణ జరిగే అవకాశాలున్నాయి. ఖర్చులు ఇస్తామని, అవకాశాలు కల్పిస్తామని హామీ ఇవ్వడంతో వెనక్కి తగ్గారు.