News March 20, 2025
10వ తరగతి పరీక్షలు పక్కడ్బందీగా నిర్వహించాలి: వరంగల్ కలెక్టర్

ఈనెల 21 నుంచి ఏప్రిల్ 4 వరకు పదవ తరగతి వార్షిక పరీక్షలను అధికారులు సమన్వయంతో పక్కడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సత్య శారద అన్నారు. కలెక్టరేట్లో సంబంధిత శాఖల అధికారులతో పరీక్షల నిర్వహణపై బుధవారం సమీక్షించారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు, 144 సెక్షన్ అమలు చేయాలని, పరీక్ష కేంద్రాల సమీపంలో జిరాక్స్ సెంటర్లను మూసి ఉంచాలన్నారు.
Similar News
News November 24, 2025
HYD: ‘గ్రూప్-2’ సమస్యలపై పోరాటం ఆగదు!

TG గ్రూప్-2 నియామక సమస్యలపై పోరాటం ఆగదని నిరుద్యోగ JAC నాయకుడు ఇంద్రా నాయక్, పిటిషనర్లు బాలాజీ, సుజాత, మానస తేల్చిచెప్పారు. దీనిపై శాశ్వత పరిష్కారం కోరుతూ పిటీషనర్లు ప్రొ.కోదండరామ్ వద్దకు వెళ్లారు. దాదాపు పదేళ్లుగా నిలిచిపోయిన నోటిఫికేషన్పై ప్రభుత్వం తక్షణ నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇందులో ప్రదీప్ రెడ్డి పాల్గొన్నారు.
News November 24, 2025
మెదక్: ప్రజావాణిలో ప్రజల సమస్యలు విన్న ఎస్పీ

మెదక్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లాలోని వివిధ గ్రామాల నుంచి ప్రజలు తరలివచ్చారు. తమ సమస్యలు, వివాదాలు, పోలీసు సంబంధిత ఇబ్బందులను వారు నేరుగా జిల్లా ఎస్పీ శ్రీనివాసరావుకు విన్నవించారు. ఎస్పీ ప్రతి ఫిర్యాదు దారునితో వ్యక్తిగతంగా మాట్లాడి, సమస్యలపై పూర్తి వివరాలు తెలుసుకున్నారు. సమస్యలను పరిశీలించి తక్షణమే పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
News November 24, 2025
MBNR: గ్రీవెన్స్ డేలో 19 ఫిర్యాదులు: ఎస్పీ

మహబూబ్నగర్ జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమంలో ఎస్పీ డి.జానకి మొత్తం 19 మంది అర్జీదారుల వినతులను స్వీకరించి, పరిశీలించారు. ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ప్రతి ఫిర్యాదుపైనా వెంటనే స్పందించిన ఎస్పీ, సంబంధిత స్టేషన్ అధికారులకు ఫోన్ ద్వారా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.


