News March 16, 2026

10వ తరగతి పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్‌ మృతి

image

కర్నూలు జిల్లాలో పదో తరగతి పరీక్షల వేళ మొదటి రోజు విషాద ఘటన జరిగింది. కర్నూలులోని పరీక్ష కేంద్రం శ్రీ చైతన్య పాఠశాలకు చీఫ్ సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్న షేక్ అన్వర్ బాషా అకస్మాత్తుగా మృతి చెందారు. గ్యాస్ట్రిక్ సమస్యతో ఆయన అస్వస్థతకు గురవగా సిబ్బంది పరీక్ష కేంద్రం సమీపంలోని అమ్మ హాస్పిటల్‌కు తరలించారు. హాస్పిటల్‌లో మృతి చెందినట్లు డీఈవో కార్యాలయం ధ్రువీకరించింది.

Similar News

News April 13, 2026

త్వరలో అప్పన్న ట్రస్ట్ బోర్డు ప్రకటన

image

సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు ఏర్పాటు దాదాపు ఖరారైంది. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపిన ప్రకారం సభ్యుల జాబితా 2, 3 రోజుల్లో విడుదలయ్యే అవకాశం ఉంది. ఈసారి ఐఏఎస్ అధికారులకు ఎక్స్‌ఆఫీషియోగా అవకాశం కల్పించనున్నారు. పార్టీకి సేవలందించిన నేతలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఉత్తరాంధ్రతో పాటు గోదావరి, కృష్ణ జిల్లాలకు ప్రాతినిధ్యం కల్పించే అవకాశం ఉంది. అలాగే జనసేన, BJP నేతలకు కూడా చోటు దక్కే అవకాశముంది.

News April 13, 2026

డీలిమిటేషన్‌పై ఏకాభిప్రాయం అవసరం: సీఎం రేవంత్

image

TG: మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్‌పై PM మోదీకి CM రేవంత్ ట్వీట్ చేశారు. ఈ రెండూ వేర్వేరు అంశాలన్నారు. ‘రాష్ట్రాల వారీగా అసెంబ్లీ సీట్లకు మహిళల కోటాను వెంటనే అమలు చేస్తే స్వాగతిస్తాం. జనాభా ఆధారిత డీలిమిటేషన్ జరగకుండా మహిళా రిజర్వేషన్ కోటాను వాడుకోవడం సరికాదు. ఇది BJPకి తాత్కాలికంగా లాభం చేకూర్చినా దక్షిణాదికి అన్యాయం జరుగుతుంది. డీలిమిటేషన్‌పై జాతీయ స్థాయిలో ఏకాభిప్రాయం అవసరం’ అని పేర్కొన్నారు.

News April 13, 2026

అనకాపల్లి చేరిన రామతీర్థం రాములోరి శోభాయాత్ర

image

విజయనగరం జిల్లా రామతీర్థం నుంచి బయలుదేరిన శోభాయాత్ర అనకాపల్లి బైపాస్ రోడ్డు తోటాడ జంక్షన్ వద్దకు సోమవారం చేరుకుంది. ఈ సందర్భంగా నూకాంబిక అమ్మవారి దేవస్థానం తరపున దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ ప్రతినిధులు, 50 మంది భక్తుల సమక్షంలో శ్రీరాములవారి జీర్ణోద్ధారణ నిమర్జన మహోత్సవం నిర్వహిం ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో నూకాంబిక దేవస్థానం ఛైర్మన్ పీలా నాగ శ్రీను, డిప్యూటీ కమిషనర్ సుజాత పాల్గొన్నారు.