News March 22, 2025
10వ తరగతి పరీక్ష కేంద్రాలను పరిశీలించిన జనగామ కలెక్టర్

జనగామ పట్టణ కేంద్రంలోని పలు పాఠశాలల్లో నిర్వహిస్తున్న 10వ తరగతి పరీక్ష కేంద్రాలను జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా పరీక్షలకు అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలన్నారు. ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా సజావుగా పరీక్షలు జరిపించాలని చీఫ్ సూపరింటెండెంట్, డిపార్టుమెంటల్ అధికారులకు సూచించారు. సహాయ సంచాలకులు రవి కుమార్, చీఫ్ సూపరింటెండెంట్ శోభన్, సత్యనారాయణ తదితరులున్నారు.
Similar News
News October 16, 2025
BREAKING: ప్రభుత్వ పిటిషన్ కొట్టివేత

బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. హైకోర్టు విధించిన స్టేను సుప్రీంకోర్టు సమర్థించింది. పాత రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ను కొట్టివేసింది.
News October 16, 2025
24 గంటల్లో ఇద్దరు ఆత్మహత్య..!

నెల్లూరు జిల్లాలో గడిచిన 24 గంటల వ్యవధిలో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. బుధవారం మనుబోలు వద్ద ఓ ఇంటర్ విద్యార్థి తనువు చాలించగా, గురువారం నార్త్ రాజుపాలెంలోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలో మరో విద్యార్థి బలవన్మరణానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఒకరు పరీక్షలు రాయలేనని, మరొకరు ట్యాబ్ దొంగతనం ఆరోపణలతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.
News October 16, 2025
బీసీ రిజర్వేషన్లు 50% దాటొచ్చనే తీర్పు లేదు: ప్రతివాదుల లాయర్

TG: బీసీ రిజర్వేషన్లపై ప్రతివాదుల తరఫున సీనియర్ లాయర్ గోపాల్ శంకర్నారాయణన్ వాదనలు వినిపిస్తున్నారు. షెడ్యూల్డ్ ప్రాంతాలు కలిగిన రాష్ట్రాల్లోనే రిజర్వేషన్ల పరిమితి 50% దాటిందన్నారు. అక్కడ SC, STలకే రిజర్వేషన్లు వర్తించాయని, BCల కోసం 50% పరిమితి దాటొచ్చనే తీర్పు లేదని వాదించారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్లో 50% పరిమితి దాటకుండా ఎన్నికలు నిర్వహించాలని గతంలో SC తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు.