News May 21, 2024

10వ తరగతి సప్లమెంటరీ పరీక్షలకు సర్వం సిద్ధం: డీఈఓ

image

ఈనెల 24వ తేదీ నుంచి జిల్లా వ్యాప్తంగా జరగబోయే పదో తరగతి సప్లమెంటరీ పరీక్షలకు అన్ని ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేశామని డీఈఓ శామ్యూల్ మంగళవారం తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 69 పరీక్షా కేంద్రాలలో 17,458 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. 69 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంట్ ఆఫీసర్‌లతో పాటు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను నియమించామని వెల్లడించారు.

Similar News

News October 2, 2024

నంద్యాల: గ్రీన్ కో పవర్ లైన్‌పై సమీక్ష

image

గ్రీన్ కో ఎలక్ట్రికల్ పవర్ లైన్ ట్రాన్స్మిషన్ ఏర్పాటుపై కలెక్టర్ రాజకుమారి మంగళవారం నంద్యాల కలెక్టరేట్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. జాయింట్ కలెక్టర్‌తో కలిసి నిర్వహించిన ఈ సమావేశంలో గ్రీన్ కో ఎలక్ట్రికల్ పవర్ లైన్ ట్రాన్స్మిషన్‌కు సంబంధించి షెడ్యూల్ కులాల హక్కులకు భంగం కలగకుండా డివిజనల్ కమిటీ సూచించిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపాలని పేర్కొన్నారు.

News October 2, 2024

ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థికి మెడిసిన్ సీటు

image

బనగానపల్లెలోని మంగళవారం పేటకు చెందిన సలాం, నాయుమున్నిసా దంపతులు కుమారుడు కలీమ్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ విడుదల చేసిన ఫేస్-2 ఫలితాల్లో మెడిసిన్ సీటు సాధించారు. దీంతో కర్నూలు ప్రభుత్వ వైద్య కళాశాలలో అతనికి సీటు దక్కింది. కలీమ్ తల్లి SGT ఉపాధ్యాయురాలిగా పనిచేస్తుండగా, తండ్రి స్వర్ణకారుడిగా పని చేస్తున్నారు. కాగా, కలీమ్ GOVT జూనియర్ కళాశాలలో చదివి సీటు సాధించడంపై ప్రశంసలు కురుస్తున్నాయి.

News October 1, 2024

సీఎం స‌మ‌క్షంలో హామీ ఇచ్చిన మంత్రి టీజీ భ‌ర‌త్

image

క‌ర్నూలు జిల్లాలో త్వ‌ర‌లోనే ట‌మోటా ప్రాసెసింగ్ యూనిట్ నెల‌కొల్పుతామ‌ని రాష్ట్ర మంత్రి టీజీ భ‌ర‌త్ చెప్పారు. పత్తికొండ మండలం పుచ్చ‌కాయ‌ల‌మ‌డలో సీఎంతో క‌లిసి ప్ర‌జావేదిక కార్య‌క్ర‌మంలో మంత్రి పాల్గొన్నారు. ఆయ‌న‌ మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో ట‌మోటా పంట‌ను ఎక్కువ‌గా సాగు చేస్తార‌న్నారు. యూనిట్ నెల‌కొల్పేందుకు ఉన్న వివాదాల‌ను త్వ‌ర‌లోనే ప‌రిష్క‌రిస్తామ‌ని సీఎం స‌మ‌క్షంలో చెప్పారు.