News December 20, 2025
10ఏళ్ల కిందటే మైనింగ్‌కు ప్రయత్నం.. అడ్డుకున్న ప్రజలు

తంబళ్లపల్లె సమీపంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మల్లయ్యకొండ, సాదుకొండ, ఇనుము కొండల్లో మైనింగ్ ప్రయత్నాలు 10ఏళ్ల కిందటే మొదలయ్యాయి. అప్పట్లో నియోజకవర్గంలోని 6మండలాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు ధర్నాలు చేపట్టారు. పార్టీలకతీతంగా నాయకులు, నేతలు ధర్నాలో పాల్గొని మద్దతు తెలిపారు. అధికారులు సహకరించడంతో ప్రజలు, నాయకుల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత, నిరసనలు వెల్లువెత్తడంతో అప్పట్లో మైనింగ్ విరమించుకున్నారు.
Similar News
News February 14, 2026
కాసేపట్లో మంత్రులతో సీఎం భేటీ.. కొత్తగూడెంపై నిర్ణయం!

ఉత్కంఠ రేపుతున్న కొత్తగూడెం కార్పొరేషన్ పీఠం వ్యవహారం సీఎం రేవంత్ రెడ్డి వద్దకు చేరింది. సీపీఐ తీర్మానం, జిల్లా మంత్రుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న సీఎం.. రెండు పార్టీల పొత్తు ధర్మంపై దిశానిర్దేశం చేయనున్నారు. కాసేపట్లో మంత్రులతో భేటీ అనంతరం మేయర్ అభ్యర్థిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అధిష్ఠానం నిర్ణయంపైనే అభ్యర్థుల భవిష్యత్తు ఆధారపడి ఉంది.
News February 14, 2026
Big Plan: హైదరాబాద్ మహా అవతారం!

HYD మరింత పెద్దది కాబోతోంది. ప్రస్తుతం HMDA పరిధి 7,257 చదరపు కిలోమీటర్లు ఉండగా దీన్ని 10,472 చదరపు KMకు పెంచాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. దీని ద్వారా 11 జిల్లాల పరిధిలోని RRR ప్రాంతాలన్నీ ఒకే గొడుగు కిందకు వస్తాయి. ముఖ్యంగా ‘ల్యాండ్ పూలింగ్’ (LADP) పద్ధతిలో 10 భారీ టౌన్‌షిప్‌ల నిర్మాణానికి కసరత్తు జరుగుతోంది. ఈ విస్తరణ పూర్తయితే HYD దేశంలోనే అతిపెద్ద మెట్రోపాలిటన్ ఏరియాల్లో ఒకటిగా మారుతుంది.
News February 14, 2026
విజయవాడ: ఈనెల 18న స్పెసిఫిక్ జాబ్ డ్రైవ్

ఏలూరు రోడ్ గుణదల సెంటర్‌లోని ఏరోస్కిల్స్ ఎయిర్‌పోర్ట్ మేనేజ్మెంట్ సర్వీసెస్ సంస్థలో ఈ నెల 18న జాబ్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు APSSDC అధికారులు తెలిపారు. SSC, ఇంటర్, ITI, డిప్లొమా, డిగ్రీ, బీటెక్ చదివి 18-40 ఏళ్లలోపు అభ్యర్థులు జాబ్ డ్రైవ్‌కు హాజరుకావొచ్చన్నారు. ఎంపికైనవారికి నెలకు రూ.23-67 వేల వేతనం ఉంటుందన్నారు. https://naipunyam.ap.gov.in/user-registrationలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు.


