News February 6, 2025
10న ఆల్బెండజోల్ మాత్రలను అందించండి: భద్రాద్రి కలెక్టర్

జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులను ఆదేశించారు. గురువారం ఐడీఓసీ కార్యాలయం సమావేశ మందిరంలో కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ నెల 10న నిర్వహించనున్న జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం రోజున 1 నుంచి 19 సంవత్సరాల వయసు గల వారందరికీ నులిపురుగులను నివారించే ఆల్బెండజోల్ మాత్రలను అందించాలన్నారు.
Similar News
News November 13, 2025
మెదక్: అల్లాదుర్గంలో మొసలి కలకలం

మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం గడిపెద్దాపూర్ గ్రామ పెద్ద చెరువులో మొసలి కలకలం రేపింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామ సమీపంలోని పెద్ద చెరువులో మొసలిని అటుగా వెళ్తున్న స్థానికులు గమనించి, భయాందోళనకు గురయ్యారు. అధికారుల స్పందించి ప్రజలకు అప్రమత్తం చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.
News November 13, 2025
భీమేశ్వర సదన్కు మారిన ఆలయ EO ఆఫీస్

వేములవాడ రాజన్న ఆలయ ఈవో కార్యాలయం భీమేశ్వర సదన్కు మారింది. 60 ఏసీ గదులున్న ఈ సముదాయంలోని ఆరు గదులలో ఈవో ఆఫీస్, అకౌంట్స్ విభాగం, మనీ వ్యాల్యూ(టికెటింగ్) తదితర విభాగాలను ఏర్పాటు చేశారు. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వరండాలోని రిసెప్షన్ గది స్థానంలో ఇంజినీరింగ్ డిపార్ట్మెంటును నెలకొల్పారు. దీంతో భక్తుల కోసం ప్రస్తుతం 54 గదులు అందుబాటులో ఉన్నాయి. కాగా, పాత EO కార్యాలయాన్ని కూల్చేయడంతో ఈ మార్పు చోటుచేసుకుంది.
News November 13, 2025
మార్నింగ్ అప్డేట్స్

* ఢిల్లీ పేలుడు: ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో వ్యక్తి మృతి.. 13కు చేరిన మరణాల సంఖ్య
* APలోని గుంటూరులో పోలీసులతో అంబటి రాంబాబు వాగ్వాదం.. విధులకు ఆటంకం కలిగించారని పట్టాభిపురం PSలో కేసు నమోదు
* TGలోని ములుగులో చలికి వృద్ధురాలు రాధమ్మ(65) మృతి
* తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం.. 10 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు
* అఫ్గానిస్థాన్లో 4.2 తీవ్రతతో భూకంపం


