News July 7, 2025
10న మెగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్

కోనసీమ జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఈ నెల 10వ తేదీన మెగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్ నిర్వహించాలని కలెక్టర్ మహేశ్ కుమార్ ఆదేశించారు. ఈ మేరకు సోమవారం అమలాపురంలోని కోనసీమ జిల్లా కలెక్టరేట్ నుంచి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, మండల స్థాయి విద్యాశాఖ అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వారికి మీటింగ్ నిర్వహణపై పలు సూచనలు చేశారు.
Similar News
News July 8, 2025
సంగారెడ్డి: ఓపెన్ పది, ఇంటర్ అప్లైకు సెప్టెంబర్ 15 వరకు అవకాశం

పదో తరగతి, ఇంటర్ ఓపెన్ స్కూల్‌లో ప్రవేశం కోసం సెప్టెంబర్ 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని డీఈవో వెంకటేశ్వర్లు ఈరోజు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. చదువు మధ్యలో మానేసి ఇంటి దగ్గర ఉంటున్న వారికి ఓపెన్ స్కూల్ గొప్ప వరమని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
News July 8, 2025
సిరిసిల్ల: ప్రజావాణి అర్జీలు సకాలంలో పరిష్కరించాలి: కలెక్టర్

ప్రజావాణిలో వచ్చే అర్జీలను సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 151 దరఖాస్తులు కలెక్టర్ స్వీకరించి, వాటిని పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో వినోద్ కుమార్, డీఆర్డీఓ శేషాద్రి, తదితరులు పాల్గొన్నారు.
News July 8, 2025
విఠలేశ్వర స్వామి కళ్యాణోత్సవంలో ఎమ్మెల్సీ కవిత

పురాణాపూల్‌లోని విఠలేశ్వర స్వామి ఆలయంలో సోమవారం జరిగిన కళ్యాణోత్సవంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. భక్తిశ్రద్ధలతో జరిగిన ఈ వేడుకలో ఆమె ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆలయ నిర్వహణపై ఆలయ పూజారులతో ఆమె చర్చించారు. ఈ కార్యక్రమంలో భక్తులు, స్థానికులు, నాయకులు పాల్గొన్నారు.