News February 16, 2026
10వ తరగతి అర్హతతో ఉద్యోగాలు.. నేడే లాస్ట్

తపాలా శాఖలో గ్రామీణ డాక్ సేవక్ ఖాళీల భర్తీకి నెల క్రితం నోటిఫికేషన్ విడుదల కాగా దరఖాస్తుకు నేడు చివరి తేదీ. పదో తరగతి మార్కుల మెరిట్‌తో వీటిని భర్తీ చేయనున్నారు. అనంతపురం డివిజన్‌లో 46, హిందూపురం డివిజన్‌లో 31 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి ఉన్నవారు నేటి సాయంత్రంలోగా indiapost.gov.inలో అప్లై చేయాలి.
వేతనం వివరాలు:
☞ బీపీఎం పోస్టులకు నెలకు రూ.12,000-29,380
☞ ఏబీపీఎం/ డాక్ సేవక్ పోస్టులకు రూ.10,000- 24,470
Similar News
News February 20, 2026
చీనీ ధరలు పెంపు.. రైతుల సంతోషం

అనంతపురం వ్యవసాయ మార్కెట్‌లో చీనీకాయలు టన్ను గరిష్ఠంగా రూ.25 వేల ధర పలికినట్లు మార్కెట్ కార్యదర్శి రాఘవేంద్ర కుమార్ తెలిపారు. మార్కెట్‌కు మొత్తం 462 టన్నుల దిగుమతి రాగా.. నాణ్యతను బట్టి కనిష్ఠంగా రూ.8 వేలు, సరాసరిగా రూ.17 ధర లభించినట్లు పేర్కొన్నారు. కొన్ని రోజులతో పోలిస్తే ధరలు ఆశాజనకంగా ఉన్నాయని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
News February 20, 2026
పుంగనూరు : కారు ఢీకొని చిన్నారి పరిస్థితి విషమం

పుంగనూరు మండలం శాంతినగర్ సమీపంలో శుక్రవారం ఉదయం రోడ్డు దాటుతున్న చిన్నారి(5)ని 42వ జాతీయ రహదారిపై మదనపల్లి నుంచి పుంగనూరుకు వస్తున్న కారు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడింది. వెంటనే స్థానికులు గాయపడ్డ చిన్నారిని ఏరియా హాస్పిటల్‌కి తరలించారు. పరిస్థితి విషమించడంతో వైద్యుల సలహా మేరకు మదనపల్లె జిల్లా ఆసుపత్రి తరలించారు. ఘటనపై పూర్తి వివరాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది.
News February 20, 2026
విశాఖ: గుర్తింపు కార్డు ఉంటేనే ఏయులోకి అనుమతి!

కొన్ని రోజులుగా ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చోటు చేసుకుంటున్న వరుస సంఘటనల నేపథ్యంలో భద్రతాచర్యలను అధికారులు పటిష్ఠం చేశారు. గుర్తింపు కార్డు కలిగిన వారిని మాత్రమే విశ్వవిద్యాలయంలోకి అనుమతిస్తున్నారు. విద్యార్థి సంఘాలు ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ మధ్య వివాదం, అదేవిధంగా గెస్ట్ ఫ్యాకల్టీ చేసిన నిరాహార దీక్షల నేపథ్యంలో భద్రతను పటిష్టం చేశారు. ఏయూ సెక్యూరిటీతో పాటు పోలీసులు కూడా పహారా కాస్తున్నారు.


