News March 20, 2025
10వ తరగతి పరీక్షలు పక్కడ్బందీగా నిర్వహించాలి: వరంగల్ కలెక్టర్

ఈనెల 21 నుంచి ఏప్రిల్ 4 వరకు పదవ తరగతి వార్షిక పరీక్షలను అధికారులు సమన్వయంతో పక్కడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సత్య శారద అన్నారు. కలెక్టరేట్లో సంబంధిత శాఖల అధికారులతో పరీక్షల నిర్వహణపై బుధవారం సమీక్షించారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు, 144 సెక్షన్ అమలు చేయాలని, పరీక్ష కేంద్రాల సమీపంలో జిరాక్స్ సెంటర్లను మూసి ఉంచాలన్నారు.
Similar News
News September 18, 2025
పామిడిలో తండ్రిని చంపిన కొడుకు

పామిడిలోని బెస్తవీధిలో తండ్రిపై కొడుకు రోకలి బండతో దాడి చేశాడు. ఈ ఘటన బుధవారం అర్ధరాత్రి జరిగింది. దాడిలో తండ్రి సుధాకర్ అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. నిందితుడిని అరెస్ట్ చేశారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News September 18, 2025
సిరిసిల్ల కలెక్టర్‌పై వారెంట్ జారీ..!

సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝాపై హైకోర్టు వారెంట్ జారీ చేసినట్లు పిటిషనర్ తరఫు న్యాయవాది బొమ్మన అర్జున్ తెలిపారు. ఏమైందంటే.. మిడ్ మానేరులో ఇంటిని కోల్పోయిన చీర్లవంచకు చెందిన వేల్పుల ఎల్లయ్య నష్టపరిహారం కోసం హైకోర్టును ఆశ్రయించాడు. అతడికి పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించినా దీనిపై కలెక్టర్ ఉదాసీనంగా వ్యవహరించారు. పైగా వివరణ కోసం కోర్టుకూ హాజరుకాలేదు. దీంతో ఆయనపై వారెంట్ జారీ అయింది.
News September 18, 2025
మాసాయిపేట: ట్రావెల్స్ బస్సులో గుండెపోటుతో ప్రయాణికుడి మృతి

మెదక్ జిల్లా మాసాయిపేటలో హైవే-44పై జరిగిన <<17746368>>రోడ్డు ప్రమాద<<>> ఘటనలో ఓ వ్యక్తి గుండెపోటుతో మృతి చెందారు. అర్ధరాత్రి వేళ ట్రావెల్స్ బస్సు అతివేగంగా వచ్చి రెండు కార్లను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ట్రావెల్స్ బస్సులో ఉన్న UPకి చెందిన రాజ్ కుమార్ పాల్ గుండెపోటుకు గురై మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తూప్రాన్ ఏరియా ఆస్పత్రికి తరలించారు.