News March 22, 2025

10వ తరగతి పరీక్ష కేంద్రాలను పరిశీలించిన జనగామ కలెక్టర్

image

జనగామ పట్టణ కేంద్రంలోని పలు పాఠశాలల్లో నిర్వహిస్తున్న 10వ తరగతి పరీక్ష కేంద్రాలను జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా పరీక్షలకు అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలన్నారు. ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా సజావుగా పరీక్షలు జరిపించాలని చీఫ్ సూపరింటెండెంట్, డిపార్టుమెంటల్ అధికారులకు సూచించారు. సహాయ సంచాలకులు రవి కుమార్, చీఫ్ సూపరింటెండెంట్ శోభన్, సత్యనారాయణ తదితరులున్నారు.

Similar News

News December 17, 2025

నేను పార్టీ మారలేదు.. స్పీకర్‌కు కడియం వివరణ

image

TG: తాను కాంగ్రెస్‌లో చేరలేదని, పార్టీ మారాననేది పచ్చి అబద్ధం అని ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు తెలిపారు. పార్టీ ఫిరాయింపుల ఆరోపణలపై కడియంకు నోటీసులు ఇవ్వగా రెండు రోజుల క్రితం ఆయన లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. తాజాగా ఐదుగురు ఎమ్మెల్యేలకు ఫిరాయింపుల కేసులో క్లీన్‌చిట్ ఇవ్వడంతో కడియం రిప్లై బయటకు వచ్చింది. అటు మరో ముగ్గురు ఎమ్మెల్యేలపై స్పీకర్ రేపు నిర్ణయం తీసుకోనున్నారు.

News December 17, 2025

కౌంటింగ్ ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్ పమేలా సత్పతి

image

ముడో విడత గ్రామ పంచాయతీల ఎన్నికలు పూర్తయిన తరువాత కౌటింగ్ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పరిశీలించారు. జమ్మికుంట మండలం మాచనపల్లి, జగ్గయ్య పల్లె గ్రామంలో కౌటింగ్ ప్రక్రియను పరిశీలించినారు. అనంతరం వీణవంక మండలం రెడ్డిపల్లి, చల్లూర్, మామిడాలపల్లెలోనూ కౌటింగ్ విధానంను పర్యవేక్షించి ఈ మేరకు అధికార్లకు పలు సూచనలు చేశారు.

News December 17, 2025

INDvsSA.. 4వ T20 రద్దు?

image

IND-SA మధ్య 4వ T20 రద్దయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. లక్నోలో AQI అతి ప్రమాదకర స్థాయిలో 391గా రికార్డైంది. 6.30PMకు టాస్ వేసే సమయంలోనే పొగమంచు కురుస్తుండడంతో విజిబిలిటీ లేదని మ్యాచ్‌ను అంపైర్లు పోస్ట్‌పోన్ చేశారు. రాత్రి కావడంతో పొగమంచు తీవ్రమవుతుంది. ప్లేయర్లు అనారోగ్యం బారినపడే ఛాన్స్ ఉండటంతో మ్యాచ్ క్యాన్సిల్ అయ్యే ఛాన్సుంది. 9pmకు మరోసారి అంపైర్లు పరిశీలించిన తర్వాత క్లారిటీ రానుంది.