News November 19, 2025

10వ తరగతి ఫలితాల్లో జిల్లా ముందజలో ఉండాలి: కలెక్టర్

image

పదవ తరగతి ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో జిల్లా ముందంజలో నిలవాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్‌లో మంగళవారం జరిగిన విద్యా శాఖ సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ.. తక్కువ ప్రగతి చూపుతున్న విద్యార్థులను గుర్తించి అదనపు బోధన అందించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటు పాఠశాలలకు మించి ర్యాంకులు సాధించాల్సిన అవసరాన్ని ఆయన వివరించారు.

Similar News

News April 5, 2026

VZM: ట్రాక్టర్, టీవీఎస్ ఢీకొని వ్యక్తి మృతి

image

రేగిడి ఆమదాలవలస మండలం కాగితాపల్లి వద్ద ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాజాం వైపు వస్తున్న ట్రాక్టర్, ఎదురుగా వస్తున్న టీవీఎస్ బండి ఢీకొన్నాయి. టీవీఎస్‌పై ఉన్న గలావిల్లికి చెందిన చందక గోవిందరావు (37) కిందపడగా ట్రాక్టర్ అతని మీదుగా వెళ్లింది. తీవ్ర గాయాలతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

News April 5, 2026

ఉమ్మడి జిల్లాలో మంత్రి బి.సి. జనార్దన్ రెడ్డి నేడు పర్యటన

image

రోడ్లు, భవనాలు, మౌలిక సదుపాయాలు శాఖ మంత్రి బి.సి. జనార్దన్ రెడ్డి ఆదివారం ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం విశాఖపట్నం నుంచి పార్వతీపురం చేరుకుని పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం సాయంత్రం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ పనులను పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించి, తర్వాత శ్రీకాకుళం జిల్లాకు బయలుదేరనున్నారని జిల్లా సమాచార శాఖ శనివారం తెలిపింది.