News February 26, 2026

10 కోట్ల ఫాలోవర్లతో ఇన్‌స్టాలో మోదీ రికార్డ్

image

ఇన్‌స్టాగ్రామ్‌లో 10 కోట్ల ఫాలోవర్స్ మార్క్‌ని దాటిన తొలి వరల్డ్ లీడర్‌గా మోదీ రికార్డు క్రియేట్ చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 4.3 కోట్లతో రెండో స్థానంలో ఉన్నారు. ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో (1.5 కోట్లు), బ్రెజిల్ అధ్యక్షుడు లూలా (1.44 కోట్లు) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇతర నేతలతో పోలిస్తే మోదీకి రెట్టింపు కంటే ఎక్కువ ఫాలోయింగ్ ఉండటం విశేషం.

Similar News

News February 27, 2026

సీక్రెట్‌గా భారత్‌కు ట్రంప్ దూత!

image

గ్లోబల్ టారిఫ్స్‌ చెల్లవని కొట్టేయడంతో ఒక్కసారిగా సీన్ రివర్స్ అయింది. మొన్నటివరకు భారతే వచ్చి ‘సారీ’ చెబుతుందన్న US కామర్స్ సెక్రటరీ హోవార్డ్ లూట్నిక్ ఇప్పుడు స్వయంగా ఢిల్లీకి వచ్చి పీయూష్ గోయల్‌తో రహస్యంగా భేటీ అయ్యారు. కోర్టు తీర్పుతో ట్రంప్ బార్గెయినింగ్ పవర్ తగ్గడంతో భారత్ తన వాషింగ్టన్ పర్యటనను వాయిదా వేసి పట్టు సాధించింది. దీంతో కంగారుపడ్డ ట్రంప్ ‘గేమ్స్ ఆడకండి’ అని వార్నింగ్ ఇచ్చారు.

News February 27, 2026

ఇజ్రాయెల్‌కు అమెరికా స్టెల్త్ విమానాలు

image

ఇరాన్‌తో అణు చర్చల వేళ అమెరికా తన మోస్ట్ అడ్వాన్స్‌డ్ F-22 రాప్టర్ స్టెల్త్ యుద్ధ విమానాలను ఇజ్రాయెల్‌కు పంపింది. బ్రిటన్ నుంచి బయలుదేరిన 12 విమానాలు ఇప్పటికే అక్కడ ల్యాండయ్యాయి. ఒకవైపు ఒమన్ మధ్యవర్తిత్వంతో జెనీవాలో చర్చలు సాగుతున్నా అమెరికా మాత్రం తన మిలిటరీ బలాన్ని పెంచుతూనే ఉంది. ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్సామ్‌ను నిలువరించడమే లక్ష్యంగా ఫైటర్ జెట్లు, యుద్ధ నౌకలను మోహరించింది.

News February 27, 2026

వదినమ్మకు ఆనంద్ దేవరకొండ అదిరిపోయే వెల్కమ్

image

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి తర్వాత తమ్ముడు ఆనంద్ దేవరకొండ తన వదినకు వెల్కమ్ చెప్పారు. ‘ఫ్యాన్స్ తనను కలిసినప్పుడల్లా ‘వదిన ఎలా ఉన్నారు?’ అని అడుగుతుంటే ఏం చెప్పాలో అర్థమయ్యేది కాదు. ఇప్పుడు ఆ ప్రశ్నకు సమాధానం దొరికింది’ అని ఆనంద్ సరదాగా పేర్కొన్నారు. అత్యంత దయగల, పాజిటివ్ పర్సన్ వదినగా రావడం చాలా సంతోషంగా ఉందని, ఈ జంట ఎప్పుడూ నవ్వుతూ ఉండాలని ఆకాంక్షించారు.