News December 17, 2025
10 గంటల ముందే రిజర్వేషన్ చార్టులు: రైల్వే బోర్డు

రైలు బయలుదేరడానికి 10 గంటల ముందే రిజర్వేషన్ చార్టులు అందుబాటులో ఉంచాలని రైల్వే బోర్డు నిర్ణయించింది. ఈ నిర్ణయం వెంటనే అమలులోకి వస్తుందని తెలిపింది. ఇన్నాళ్లూ 4 గంటల ముందు చార్టును అందుబాటులో ఉంచేది. దీంతో స్టేషన్‌కు రావడం, ట్రావెల్ ప్లాన్ చేసుకోవడం వంటి ఇబ్బందులను ప్రయాణికులు ఎదుర్కొంటున్నారు. వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న ప్రయాణికులకు ఈ నిర్ణయం ఊరటనిస్తుందని అధికారులు చెబుతున్నారు.
Similar News
News December 18, 2025
ట్రైన్‌లో రాత్రిపూట ప్రయాణిస్తున్నారా?

ఎక్కువ దూరం రైలులో వెళ్లాలంటే చాలామంది రాత్రి ప్రయాణానికి ఆసక్తి చూపిస్తారు. అయితే ట్రైన్ ప్రయాణం చేసేటప్పుడు కొన్ని రూల్స్ తెలుసుకోవాలి. 10:00 PM తర్వాత ఇతరులకు ఇబ్బంది కలిగించేలా మ్యూజిక్ పెట్టకూడదు. వృద్ధులు, గర్భిణులు ఉంటే వారికి లోయర్ బెర్త్‌లు కేటాయిస్తారు. ఈ-టికెట్‌తో ప్రయాణించే వారు ID కార్డు చూపించాలి. మద్యం సేవించడం నేరం. ఏదైనా సమస్య వస్తే RPF లేదా 139కి కాల్ చేసి ఫిర్యాదు చేయొచ్చు.
News December 18, 2025
21 ఏళ్లకే సర్పంచ్ పదవి

TG: పంచాయతీ ఎన్నికల్లో యువత సత్తా చాటారు. సంగారెడ్డి(D) కల్హేర్(M) అలీఖాన్‌పల్లిలో BRS బలపరిచిన 21 ఏళ్ల గుగులోతు రోజా(Left) 76 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. సిద్దిపేట(D) అక్కన్నపేట(M) సేవాలాల్ మహారాజ్ తండా సర్పంచ్‌గా కాంగ్రెస్ బలపరిచిన 22 ఏళ్ల జరుపుల సునీత(Right) 30 ఓట్ల తేడాతో గెలుపొందారు. చిన్న వయసులోనే సర్పంచులుగా గెలుపొందడం పట్ల గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేశారు.
News December 18, 2025
కుంకుమ సువాసన, రంగు కూడా ఆరోగ్యమే

నుదిటిపై కుంకుమ ధరించడం వలన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయన్న విషయం తెలిసిందే! అయితే దాని వాసన, రంగుతో కూడా ఆరోగ్యపరంగా మనకెన్నో లాభాలున్నాయని పండితులు చెబుతున్నారు. ‘కుంకుమ సువాసన మన శరీరంలో సానుకూల శక్తిని పెంచుతుంది. దీని ఎరుపు రంగు సంపూర్ణ అగ్ని సూత్రాన్ని సూచిస్తుంది. నుదిటిపై కుంకుమ ధరించడం భౌతిక సుఖాల పట్ల నిర్లిప్తతను పెంచి, అంతిమ చైతన్యం వైపు మనల్ని నడిపించేందుకు సహాయపడుతుంది’ అని అంటున్నారు.


