News January 4, 2026

10 నిమిషాల్లోనే డెలివరీ అయిపోవాలా?

image

డెలివరీ ఏజెంట్ల <<18740820>>నిరసనతో<<>> క్విక్ కామర్స్ సంస్థల ‘10 నిమిషాల’ డెలివరీ అంశం హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఈ విధానంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మెజార్టీ వినియోగదారులు ఇది అవసరం లేదంటున్నారు. మెడిసిన్స్ మినహా ఇతర సరుకులు ఆలస్యమైనా మునిగిపోయేదేం లేదని అంటున్నారు. కానీ కొందరు మాత్రం 10 నిమిషాల్లో డెలివరీ ఉండాల్సిందేనని వాదిస్తున్నారు. మరి మీరేమంటారు? COMMENT

Similar News

News February 16, 2026

సర్వైకల్ క్యాన్సర్‌ ఎలా వస్తుంది?

image

గర్భాశయ ముఖద్వారం(Cervical Cervix)లోని కణాలకు సోకే హ్యూమన్ పాపిలోమా వైరస్(HPV) ఇది. చిన్నవయసులోనే పెళ్లిళ్లు-లైంగిక చర్య, వ్యక్తిగత శుభ్రత పాటించకపోవడం, ఎక్కువసార్లు ప్రసవాలు కావడం ఈ క్యాన్సర్‌కు ప్రధాన కారణాలు. లైంగిక సంబంధాలతోనూ వ్యాపిస్తుంది. వంశపారపర్యం వల్ల రాదు. వైరస్ సోకిన 10-15 ఏళ్ల తర్వాత క్యాన్సర్ బయటపడుతుంది. అందుకే TG ప్రభుత్వం అమ్మాయిలకు ముందస్తుగా <<19154216>>వ్యాక్సిన్<<>> ఇవ్వనుంది.

News February 16, 2026

శశికళ కొత్త పార్టీ!

image

తమిళనాడు మాజీ సీఎం జయలలిత నెచ్చెలి శశికళ రాజకీయాల్లో తిరిగి యాక్టివ్ కానున్నారు. కొత్త పార్టీని ఏర్పాటు చేసేందుకు ఆమె సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. జయలలిత జయంతి రోజైన ఫిబ్రవరి 24న పార్టీ పేరును, విధివిధానాలను ప్రకటించే అవకాశముంది. తమిళనాడులో ఏప్రిల్/మేలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఈ ఎన్నికల బరిలో దిగితే పొత్తు పెట్టుకుంటారా? ఒంటరిగా పోటీ చేస్తారా? అనేది తెలియాల్సి ఉంది.

News February 16, 2026

వీరు ఉపవాసం చెయ్యకూడదు

image

ఉపవాసం మంచిదే కొందరికి ఇది మంచిది కాదంటున్నారు నిపుణులు. ముఖ్యంగా గుండె జబ్బులు, BP, కొరోన‌రీ ఆర్ట‌రీ, అరిథ్మియా స‌మ‌స్య‌లున్న‌వారు ఉప‌వాసం చేస్తే చ‌క్కెర స్థాయిలు, ఎల‌క్ట్రోలైట్ స‌మ‌తుల్య‌త‌, నీటి శాతం త‌గ్గ‌డం వంటి స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి. బీటా బ్లాక‌ర్స్, యాంటీ అరిథ‌మిక్స్, బ్ల‌డ్ థిన్న‌ర్స్ మందులు వాడే వారు ఆహారంతో పాటు నిర్దిష్ట స‌మ‌యంలో మందుల‌ను వేసుకోవాలి. కాబట్టి ఉపవాసానికి దూరంగా ఉండాలి.