News January 3, 2026

10 నిమిషాల డెలివరీలపై బ్లింకిట్ ఫౌండర్ ఏమన్నారంటే?

image

క్విక్ కామర్స్‌లో 10 నిమిషాల డెలివరీపై వస్తోన్న విమర్శలపై బ్లింకిట్ (జొమాటో) ఫౌండర్ దీపిందర్ గోయల్ స్పందించారు. ‘స్టోర్లకు దగ్గరగా ఉన్న కస్టమర్లకే ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఆర్డర్ ప్లేస్ అయిన 2.5 నిమిషాల్లో ప్యాకింగ్ పూర్తవుతుంది. డిస్టెన్స్ 2 KM మాత్రమే ఉంటుంది కాబట్టి 8 నిమిషాల టైమ్ ఉంటుంది. సగటు వేగం గంటకు 15 KM మాత్రమే. దీనివల్ల డెలివరీ ఏజెంట్లకు రిస్క్ ఏం ఉండదు’ అని ట్వీట్ చేశారు.

Similar News

News February 20, 2026

పంటలను నాశనం చేస్తున్న ఆఫ్రికన్ నత్తలు

image

పంటలపై ఆఫ్రికన్ నత్తల దాడుల ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో పెరిగిపోయాయి. ఇవి పొలాలు, తోటల్లో చేరి మొక్కల ఆకులు, కాయలు, పండ్లను తినడం వల్ల తీవ్ర పంట నష్టం కలగడంతో పాటు రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. ముఖ్యంగా బొప్పాయి, మామిడి, అరటి, కాఫీ, రబ్బరు, పత్తి, రాగులు, కొబ్బరి, పొద్దుతిరుగుడు, అపరాలు, నూనెగింజలు, వంగ, దోస, క్యాబేజి, బెండ, మల్బరీ, బంతి తోటల్లో వీటి ముప్పు ఎక్కువైందని నిపుణులు చెబుతున్నారు.

News February 20, 2026

నేషనల్ ఏరోస్పేస్ లాబోరేటరీస్‌లో 28 పోస్టులు

image

CSIR-నేషనల్ ఏరోస్పేస్ లాబోరేటరీస్ 28 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనుంది. ఐటీఐ అర్హతగల అభ్యర్థులు ముందుగా NATS పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మార్చి 11, 12తేదీల్లో ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు. ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్, టర్నర్, MMV, డ్రాఫ్స్‌మెన్ మెకానికల్‌కు నెలకు స్టైపెండ్ రూ.10,560, వెల్డర్‌కు రూ.9600 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.nal.res.in

News February 20, 2026

శుక్రవార వ్రతం ఎప్పుడు ప్రారంభించాలంటే?

image

సంతోషీ మాత వ్రతాన్ని ప్రారంభించడానికి సరైన సమయం ఏ నెలలోనైనా వచ్చే శుక్ల పక్ష శుక్రవారం. చంద్రుని వృద్ధి చెందే కాలమైన శుక్ల పక్షంలో వ్రతాన్ని మొదలుపెట్టడం శుభప్రదంగా భావిస్తారు. ఇలా ప్రారంభించిన వ్రతాన్ని మధ్యలో విరామం లేకుండా వరుసగా 16 శుక్రవారాల పాటు కొనసాగించాలి. అనివార్య కారణాల వల్ల ఏదైనా వారం వ్రతం చేయలేకపోతే ఆ వారాన్ని వదిలేసి తదుపరి వారం నుంచి తిరిగి కొనసాగించాలి. మొత్తం 16 వారాలు చేయాలి.