News January 31, 2026
10 రోజుల్లో కొత్త సినిమా అప్డేట్: అనిల్

కొత్త సినిమాపై మరో 10-15 రోజుల్లో అప్డేట్ ఇస్తానని డైరెక్టర్ అనిల్ రావిపూడి తెలిపారు. మూవీపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాక ఆయన మీడియాతో మాట్లాడారు. తన తర్వాతి మూవీ వెంకటేశ్‌తో తీస్తున్నారని, కార్తీ లేదా ఫహాద్ ఫాజిల్ నటించే అవకాశం ఉందని సినీవర్గాల టాక్. ఇటీవల చిరంజీవి హీరోగా ‘మన శంకర వరప్రసాద్‌గారు’ చిత్రంతో అనిల్ సూపర్ హిట్ అందుకోవడం తెలిసిందే.
Similar News
News February 12, 2026
11 బంతుల్లో 5 వికెట్లు కోల్పోయిన భారత్

నమీబియాతో మ్యాచులో మరింత స్కోర్ చేయాల్సిన IND 209రన్స్‌కే పరిమితమైంది. ఒక దశలో 250 దాటుతుందని భావించినా ఇన్నింగ్స్ చివరి 11బంతుల్లో 5వికెట్లు కోల్పోవడంతో స్కోర్ పడిపోయింది. ఊపు మీదున్న పాండ్య 19వ ఓవర్ రెండో బాల్‌కు ఔట్ కాగా తర్వాతి బంతికి దూబే రనౌట్ అయ్యారు. అదే ఓవర్ చివరి బాల్‌కు అక్షర్ బౌల్డ్ అయ్యారు. 20వ ఓవర్ మూడో బంతికి రింకూ, చివరి బాల్‌కు అర్ష్‌దీప్ ఔటయ్యారు. 11 బాల్స్‌లో 4 రన్సే వచ్చాయి.
News February 12, 2026
T20 WC: భారత్ భారీ స్కోర్

నమీబియాతో మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 209/9 రన్స్ చేసింది. ఇషాన్ కిషన్ (61), హార్దిక్ (52) రాణించారు. దూబే 23, శాంసన్ 22, తిలక్ 25, సూర్య 12 పరుగులు చేశారు. 19వ ఓవర్లో భారత్ 3 వికెట్లు(పాండ్య, దూబే, అక్షర్) కోల్పోవడంతో స్కోర్ కాస్త తగ్గింది.
News February 12, 2026
‘ఆయుష్’లో త్వరలో 358 పోస్టుల భర్తీ: మంత్రి సత్యకుమార్

AP: ఆయుష్ శాఖలో వివిధ కేటగిరీల్లో నేషనల్ ఆయుష్ మిషన్ ద్వారా 358 పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టామని మంత్రి సత్యకుమార్ తెలిపారు. ‘వీటిలో డాక్టర్, సైకియాట్రిస్ట్, ఫిజియోథెరపిస్ట్, పంచకర్మ థెరపిస్ట్, యోగా ఇన్‌స్ట్రక్టర్, మల్టీపర్పస్ వర్కర్, స్వీపర్ వంటి పోస్టులు ఉన్నాయి. అలాగే 1 ఆయుర్వేద, 3 హోమియో కాలేజీల్లోని 140 టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టులు కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తాం’ అని వివరించారు.


