News February 22, 2026

10 రోజుల్లో ఖాతాల్లోకి డబ్బులు

image

TG: రాష్ట్రానికి విడుదల చేసిన 15వ ఆర్థిక సంఘం నిధులను 10 రోజుల్లోగా గ్రామ పంచాయతీ ఖాతాల్లో జమ చేయాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆలస్యమైతే ఆ నిధులను వడ్డీతో సహా లోకల్ బాడీలకు రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే మూడు విడతల్లో రూ.1,034.42 కోట్ల నిధులు విడుదలయ్యాయి. మిగిలిన రూ.2 వేల కోట్ల బకాయిలు రావాలంటే పాత నిధుల వినియోగ ధ్రువీకరణ పత్రాలు (UCs) సమర్పించాలని కేంద్రం పేర్కొంది.

Similar News

News March 1, 2026

ఒకే దెబ్బకు 48 మంది ఇరాన్ నేతలను చంపేశాం.. ట్రంప్ ప్రకటన

image

ఇరాన్‌పై యుద్ధం నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఒకే దెబ్బకు 48 మంది ఇరాన్ నేతలను అంతమొందించామని వెల్లడించారు. US-ఇజ్రాయెల్ సాధించిన విజయాన్ని ఎవరూ నమ్మలేరని పేర్కొన్నారు. ఊహించిన దానికంటే సైనిక ఆపరేషన్ వేగంగా కొనసాగుతోందని చెప్పారు. ఇరాన్ నేతలు తనతో మాట్లాడాలని అనుకుంటున్నారని, ఆ దేశంతో చర్చలకు సిద్ధమని ట్రంప్ ప్రకటించారు.

News March 1, 2026

‘అబ్రహం లింకన్‌’ షిప్‌పై దాడి జరగలేదు: US

image

తమ ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ ‘అబ్రహం లింకన్‌’పై <<19274213>>దాడి<<>> జరిగిందన్న వార్తలను US సెంట్రల్ కమాండ్ ఖండించింది. దాడి చేశామని ఇరాన్ చెప్పిందంతా అబద్ధమని ఓ ప్రకటనలో పేర్కొంది. ‘లింకన్‌ను ఏ మిస్సైల్ కూడా ఢీకొట్టలేదు. దాని దగ్గరగా కూడా చేరుకోలేదు. ఇరాన్ నుంచి వచ్చే ముప్పులను తొలగించి అమెరికన్లను రక్షించేందుకు సెంట్రల్ కమాండ్‌తో కలిసి లింకన్ షిప్ విమానాలను ప్రయోగిస్తోంది’ అని స్పష్టం చేసింది.

News March 1, 2026

10% పెరిగిన క్రూడ్ ఆయిల్ ధర

image

మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతల కారణంగా బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 10% పెరిగి బ్యారెల్‌కు $80కి చేరుకుంది. ఇది మరింత పెరిగి $100కి చేరవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇరాన్ హెచ్చరికలతో స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ సముద్ర మార్గం ద్వారా వెళ్లే ఆయిల్ ట్యాంకర్లు ఆగిపోయాయి. ప్రపంచంలోని 20-30% ఆయిల్, LNG ఈ మార్గం గుండానే కంపెనీలు తరలిస్తుంటాయి. ఇప్పుడు రవాణా ఆగిపోవడంతో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే ఛాన్సుంది.