News November 24, 2024

నట్టూకు రూ.10.75 కోట్లు

image

IPL మెగా వేలంలో పేసర్ నటరాజన్ మంచి ధర పలికారు. రూ.2 కోట్ల బేస్ ప్రైజ్ ఉన్న అతడిని రూ.10.75 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. ఇతడు IPLలో 61 మ్యాచులు ఆడి 67 వికెట్లు తీశారు. యార్కర్లు, స్లో బాల్స్‌తో ప్రత్యర్థులను కట్టడి చేయడంలో నట్టూ స్పెషలిస్ట్.

Similar News

News January 12, 2026

కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో 132 పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

<>కొచ్చిన్<<>> షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో 132 పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో డిప్లొమా, BSc , PG డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాత పరీక్ష, ప్రాక్టికల్ టెస్ట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://cochinshipyard.in/

News January 12, 2026

మారేడు దళాల నోము ఎలా చేయాలి?

image

సోమవారం/మాస శివరాత్రి/ఆరుద్ర నక్షత్రం ఉన్న రోజుల్లో గణేషుడి వద్ద సంకల్పం తీసుకొని మొదలుపెట్టాలి. ఏడాది పాటు రోజూ 3 మారేడు ఆకులను, దోసెడు బియ్యాన్ని తీసుకుని శివుడిని భక్తితో పూజించాలి. ఏడాది ముగిసాక ఉద్యాపన నిర్వహించాలి. ఉద్యాపనలో బంగారు మారేడు దళం, వెండి మారేడు దళం, సహజమైన మారేడు దళాన్ని ఉంచి, మూడు దోసిళ్ల బియ్యంతో శివుడిని ఆరాధించాలి. అనంతరం పేదలకు అన్నదానం చేయడం ద్వారా ఈ నోము సంపూర్ణమవుతుంది.

News January 12, 2026

సంక్రాంతికి మరో 3 ప్రత్యేక రైళ్లు

image

సంక్రాంతికి ద.మ.రైల్వే అనకాపల్లి-చర్లపల్లి మధ్య అదనంగా మరో 3 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. అనకాపల్లిలో 18న ఒక ట్రైన్(07479), 19న ఒక ట్రైన్(07478) రాత్రి 10.30 గం.కు బయలుదేరి తర్వాతి రోజు ఉ.11.30గం.కు చర్లపల్లి చేరుకుంటుంది. 19న చర్లపల్లి(07477)లో అర్ధరాత్రి 12.40 గం.కు బయలుదేరి అదే రోజు రా.9 గంటలకు అనకాపల్లి చేరుకుంటుంది. ఈ రైళ్లు నల్గొండ, మిర్యాలగూడ, GNT, VJA, రాజమండ్రి మీదుగా నడుస్తాయి.