News August 10, 2024
గోల్డ్ మెడలిస్ట్ నదీమ్‌కు 10 కోట్ల(PKR) బహుమతి

ఒలింపిక్స్: జావెలిన్ త్రోలో గోల్డ్ మెడల్ సాధించిన పాక్ అథ్లెట్ అర్షద్ నదీమ్‌కు పంజాబ్ ప్రావిన్స్ సీఎం మరియమ్ నవాజ్ 10 కోట్ల(PKR) బహుమతి ప్రకటించారు. అలాగే అతని హోం సిటీ ఖనేవాల్‌లో స్పోర్ట్స్ సిటీ నిర్మిస్తామని తెలిపారు. జావెలిన్ కొనుగోలు చేయడానికీ డబ్బులు లేక ఇబ్బంది పడిన అతనిపై ఇప్పుడు కాసుల వర్షం కురుస్తోంది. కాగా ఈ ఈవెంట్‌లో భారత స్టార్ నీరజ్ చోప్రా రజతం సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
Similar News
News March 7, 2026
హైదరాబాద్‌కు నెట్‌ఫ్లిక్స్

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ హైదరాబాద్‌లో కార్యాలయం ఏర్పాటు చేయనుంది. 30వేల చ.అడుగుల ఈ ఆఫీస్‌ను సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు ఈ నెల 12న ప్రారంభించనున్నారు. నెట్‌ఫ్లిక్స్‌కు ఇప్పటికే ముంబైలో కార్యాలయం ఉండగా భారత్‌లో ఇది రెండోది కానుంది. ఓటీటీ ప్లాట్‌ఫామ్ రాకతో HYDలో యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ అండ్ కామిక్స్ సెక్టార్లు బలోపేతం అవుతాయని ప్రభుత్వం భావిస్తోంది.
News March 7, 2026
BREAKING: భారీ షాక్ ఇచ్చిన బంగారం ధర

కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధర ఇవాళ భారీగా పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.2,510 పెరిగి రూ.1,63,640కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.2,300 ఎగబాకి రూ.1,50,000 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.2,90,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలుండొచ్చు.
News March 7, 2026
సివిల్స్ అభ్యర్థులకు రేవంత్ అభినందనలు.. BRSపై విమర్శలు

TG: సివిల్స్‌లో సత్తా చాటిన తెలుగు అభ్యర్థులకు CM రేవంత్ అభినందనలు తెలిపారు. ‘రాజీవ్ సివిల్స్ అభయ హస్తం’ ద్వారా సాయం పొందిన 20 మంది మంచి ర్యాంకులు సాధించడం సంతోషంగా ఉందన్నారు. ‘గత ప్రభుత్వం పేదల బిడ్డలు బర్లు, గొర్లు కాసుకొని బతకాలని భావించింది. మన ప్రభుత్వం వారి విద్యకు ప్రాధాన్యం ఇచ్చి IASలు, IPSలుగా ఎదగాలని తోడుగా నిలుస్తోంది’ అని ట్వీట్ చేశారు. వారు TG పునర్నిర్మాణంలో భాగస్వామ్యం కావాలన్నారు.


