News July 30, 2024
10 రోజులు స్కూల్ బ్యాగ్ల మోతకు చెక్

6-8 తరగతుల విద్యార్థులకు ఏడాదిలో 10 రోజులు పుస్తకాల మోత నుంచి ఉపశమనం కల్పించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు మార్గదర్శకాలను విడుదల చేసింది. ‘3 దశల్లో ఈ విధానాన్ని అమలు చేయాలి. టీచర్లు, స్టూడెంట్ల భాగస్వామ్యంతో ఇండోర్, ఔట్డోర్ కార్యక్రమాలు నిర్వహించాలి. కూరగాయల మార్కెట్లు, సోలార్ ఎనర్జీ, బయోగ్యాస్ ప్లాంట్ల సందర్శన, బుక్ఫెయిర్ నిర్వహణ, గాలిపటాల తయారీ, ఎగురవేయడం చేయాలి’ అని సూచించింది.
Similar News
News November 17, 2025
ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్

నేటి నుంచి ఎల్లుండి ఉదయం 8.30 గంటల వరకు రాష్ట్రంలో చలిగాలుల ప్రభావం తీవ్రంగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రేపు తెల్లవారుజామున ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డిలో ఉష్ణోగ్రతలు పడిపోతాయని పేర్కొంటూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఎల్లుండి ఆదిలాబాద్, ఆసిఫాబాద్, సంగారెడ్డి, మెదక్, నిర్మల్లో చలి తీవ్రత ఉంటుందంటూ ఎల్లో అలర్ట్ ఇచ్చింది.

హనుమాన్ చాలీసా భావం – 12

రఘుపతి కీన్హీ బహుత బడాయీ |
తుమ మమ ప్రియ భరత సమ భాయీ ||
హనుమంతుడు చేసిన సాయానికి రాముడు ఆయనను ఎంతో మెచ్చుకున్నారు. ‘నీవు నాకు నా ప్రియమైన తమ్ముడైన భరతునితో సమానమైన ఆప్తుడివి’ అని ప్రకటించారు. ఇది ఆంజనేయుడి సేవ, నిస్వార్థ భక్తికి శ్రీరాముడు ఇచ్చిన గుర్తింపు. నిజమైన సేవకు, భక్తికి దేవుడి అనుగ్రహం, అపారమైన గౌరవం దక్కుతాయనడానికి ఇదే నిదర్శనం. <<-se>>#HANUMANCHALISA<<>>