News August 7, 2024
50వేలమంది ఉద్యోగులకు 10రోజుల ‘వెకేషన్’!

గుజరాత్‌కు చెందిన కిరణ్ జెమ్స్ కంపెనీ ఆసక్తికర నిర్ణయం తీసుకుంది. సంస్థలోని 50వేలమందికి ఈ నెల 17 నుంచి 27 వరకు 10 రోజుల పాటు వేతనంతో కూడిన సెలవు ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా వజ్రాలకు గిరాకీ తగ్గిందని, ఉత్పత్తిని తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని యజమాని వల్లభ్‌భాయ్ లఖానీ తెలిపారు. సహజ వజ్రాల ఉత్పత్తిదారుల్లో తమదే అతి పెద్ద సంస్థ అని ఆయన పేర్కొన్నారు.
Similar News
News December 1, 2025
భక్తికి, నిరీక్షణకు ప్రతీక ‘శబరిపీఠం’

నిర్గుణోపాసన, నిరంతర నిరీక్షణకు ప్రతీక ‘శబరిపీఠం’. ఈ పవిత్ర స్థలంలోనే శబరి మాత కఠోర భక్తితో అయ్యప్ప స్వామి దర్శనం పొందింది. ఈ పీఠానికి దాదాపు 5 వేల సంవత్సరాల చరిత్ర ఉందని చెబుతారు. పూర్వకాలంలో, పందళ రాజవంశీయులు ఇక్కడ ఓ విద్యాపీఠాన్ని ఏర్పాటు చేసి విద్యనభ్యసించారని ప్రతీతి. భక్తికి, నిరీక్షణకు గొప్ప ఉదాహరణగా నిలిచే ఈ ప్రదేశం అయ్యప్ప స్వాములకు పరమాత్మ దర్శనానికి మార్గాన్ని చూపిస్తుంది. <<-se>>#AyyappaMala<<>>
News December 1, 2025
WhatsApp: కొత్త నిర్ణయంతో తిప్పలు తప్పవు!

కేంద్రం తెస్తున్న <<18424391>>‘సిమ్ బైండింగ్’<<>> రూల్ కొందరు వాట్సాప్ యూజర్లపై ప్రభావం చూపనుంది. ఏ నంబర్‌తో యాప్ వాడితే సిమ్ ఆ మొబైల్లో ఆన్‌లో ఉండాలనే రూల్‌తో ఫారిన్ ట్రిప్స్ వెళ్లే వారికి, సిమ్ లేని వారికి ఇబ్బందే. ప్రస్తుతం ఆఫీస్ నంబర్‌తో లింకైన అకౌంట్లు మల్టిపుల్ డివైజ్‌లలో లాగిన్‌లో ఉంటాయి. కానీ ప్రతి 6గం.కు వెబ్ వర్షన్స్ ఆటో- లాగౌట్ నిర్ణయంతో రి-లాగిన్, చాట్స్ లోడింగ్ టైమ్ టేకింగ్ ప్రాసెస్.
News December 1, 2025
ప్రాజెక్టులకు తక్కువ వడ్డీకే రుణాలివ్వాలి: CM

TG: ఫ్యూచర్ సిటీ, మెట్రోరైల్ విస్తరణ, RRR, రేడియల్ రోడ్ల నిర్మాణాలకు తక్కువ వడ్డీకే రుణాలివ్వాలని CM రేవంత్ హడ్కో ఛైర్మన్ సంజయ్ కులశ్రేష్ఠను కోరారు. అత్యధిక వడ్డీతో ఇచ్చిన లోన్లను రీకన్స్ట్రక్షన్ చేయాలన్నారు. మరో 10L ఇళ్ల నిర్మాణానికి రుణాలివ్వాలని విజ్ఞప్తి చేశారు. వీటిపై హడ్కో ఛైర్మన్ సానుకూలంగా స్పందించారు. గ్రీన్‌ఫీల్డ్ రోడ్లు, బుల్లెట్ ట్రైన్ అంశాలపైనా వారు చర్చించారు.


