News March 26, 2024
శ్రీవారి దర్శనానికి 10 గంటల సమయం

AP: తిరుమల శ్రీవారి దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. 15 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న స్వామివారిని 78371 మంది భక్తులు దర్శించుకోగా 25156 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.4 కోట్లు లభించింది.
Similar News
News April 21, 2025
IPL 2025: 400+ రన్స్ చేసిన సాయి సుదర్శన్

గుజరాత్ ప్లేయర్ సాయి సుదర్శన్ ఈ సీజన్‌లోనూ మంచి ఫామ్‌ను కొనసాగిస్తున్నారు. KKRతో జరుగుతున్న మ్యాచుతో అర్ధసెంచరీ చేసిన ఆయన IPL 2025లో 400కి పైగా పరుగులు పూర్తి చేసుకున్న తొలి ఆటగాడిగా నిలిచారు. ఇందులో ఐదు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. మొత్తం 8 మ్యాచుల్లో వరుసగా 74, 63, 49, 5, 82, 56, 36, 52 పరుగులు చేశారు.
News April 21, 2025
తర్వాతి పోప్ అయ్యే ఛాన్స్ వీరికే!

పోప్ ఫ్రాన్సిస్ గతించడంతో ఆయన స్థానంలో తర్వాతి పోప్ ఎవరా అన్న ఆసక్తి ప్రపంచవ్యాప్తంగా నెలకొంది. ఐదుగురి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. వారు..
* లూయిస్ టగ్లే(ఫిలిప్పీన్స్)
* పియెట్రో పారోలిన్(ఇటలీ)
* జీన్-మార్క్ అవెలీన్(ఫ్రాన్స్)
* విలెమ్ ఐజ్క్(నెదర్లాండ్స్)
* మాల్కమ్ రంజిత్(శ్రీలంక)
News April 21, 2025
BREAKING: గ్రూప్-1 మెయిన్స్ షెడ్యూల్ విడుదల

AP: గ్రూప్-1 మెయిన్స్ రాత పరీక్షకు ఏపీపీఎస్సీ షెడ్యూల్ విడుదల చేసింది. మే 3 నుంచి 9 వరకు 4 జిల్లా కేంద్రాల్లో పరీక్షను నిర్వహించనున్నట్లు తెలిపింది. అన్ని పేపర్లకు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకూ పరీక్షలు జరగనున్నాయి. ఈరోజు నుంచే హాల్ టికెట్లను https://psc.ap.gov.in వెబ్‌సైట్లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.