News May 28, 2024

10 లక్షల ప్రమాద క్లెయిమ్‌లు పెండింగ్!

image

రోడ్డు ప్రమాద బాధితులకు బీమా సంస్థలు వేగంగా సెటిల్మెంట్ చేయడం లేదు. ప్రస్తుతం రూ.80,455 కోట్ల విలువైన 10,46,163 క్లెయిమ్‌లు పెండింగ్‌లో ఉన్నట్లు RTI సమాచారంతో వెల్లడైంది. బాధితులకు సత్వర న్యాయం అందకపోవడంపై కేసీ జైన్ అనే న్యాయవాది సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు. త్వరలోనే ఇది విచారణకు రానుంది.

Similar News

News February 19, 2026

చైనా అద్భుతం.. స్టెమ్‌ సెల్ థెరపీతో డయాబెటిస్ నయం

image

చైనా సైంటిస్టులు అద్భుతం చేశారు. స్టెమ్‌ సెల్ థెరపీతో ప్రపంచంలోనే తొలిసారిగా టైప్-2 డయాబెటిస్‌ వ్యాధిని నయం చేశారు. ఆరోగ్యకరమైన ప్యాంక్రియాటిక్ కణాలను మార్పిడి చేసి శరీరం ఇన్సులిన్‌ను సరిగ్గా ఉపయోగించుకునేలా చేశారు. ఈ చికిత్స విజయవంతమైంది. ఇది పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే రోగి ఇన్సులిన్ ఇంజెక్షన్లపై ఆధారపడాల్సిన అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా డయాబెటిస్ కేసులు పెరుగుతున్న విషయం తెలిసిందే.

News February 19, 2026

డయాబెటిస్ రోగుల్లో స్టెమ్‌ సెల్ థెరపీ ఎలా పనిచేస్తుంది?

image

తొలుత డయాబెటిస్ రోగి లేదా దాత నుంచి స్టెమ్ సెల్స్‌ను తీసుకుంటారు. ల్యాబ్‌లో ప్రత్యేక రసాయనాలు, జెనెటిక్ విధానాల ద్వారా ప్యాంక్రియాటిక్(ఇవి జీర్ణక్రియకు అవసరమైన ఎంజైమ్‌లను, చక్కెర స్థాయులను నియంత్రించే హార్మోన్లను ఉత్పత్తి చేస్తాయి) కణాలను రూపొందిస్తారు. ఇవి ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసే స్థాయికి చేరగానే రోగి శరీరంలోకి మార్పిడి చేస్తారు. బాడీ వాటిని స్వీకరించే దానిని బట్టి సక్సెస్ రేటు ఉంటుంది.

News February 19, 2026

జింబాబ్వే.. ఓటమి లేకుండా సూపర్-8కు..

image

T20WC-2026: జింబాబ్వే జట్టు ఈసారి ఒక్క ఓటమి లేకుండా సూపర్-8లోకి అడుగుపెట్టింది. గ్రూప్-Bలో ఒమన్, ఆస్ట్రేలియా, శ్రీలంకలపై విజయం సాధించింది. ఐర్లాండ్‌తో మ్యాచ్ వర్షం వల్ల రద్దైంది. 1.506 NRRతో ఆ గ్రూప్‌లో టాప్-1గా నిలిచింది. ఇక సూపర్-8లో జింబాబ్వే.. భారత్, సౌతాఫ్రికా, వెస్టిండీస్‌లతో తలపడనుంది. మరి సూపర్-8లో ఈ జట్టు ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.