News September 27, 2024
తొలి దశలో 10 లక్షల ఇందిరమ్మ ఇళ్లు

TG: రాష్ట్రంలో తొలి దశలో భాగంగా 10 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని సర్కార్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. పథకాన్ని పారదర్శకంగా అమలు చేసేందుకు గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కమిటీలు ఏర్పాటు చేస్తుందని సమాచారం. పంచాయతీ కార్యదర్శి, అంగన్వాడీ టీచర్, ఆశా కార్యకర్త, రెవెన్యూ సిబ్బందితో కలిపి గ్రామ కమిటీ వేయనుంది. మొదటి దశలో సొంత స్థలం ఉన్నవారికి, రెండో దశలో స్థలం లేనివారికి ఇవ్వనుంది.
Similar News
News September 15, 2025
రోడ్డు వేసి 50 ఏళ్లు.. అయినా చెక్కుచెదరలేదు!

ప్రస్తుతం రూ.వేల కోట్లతో నిర్మించిన రోడ్లు చిన్న వర్షానికే ధ్వంసమవుతున్నాయి. కానీ 50 ఏళ్ల క్రితం నిర్మించిన ఓ రోడ్డు ఇంకా చెక్కు చెదరకుండా ఉంది. అదే మహారాష్ట్ర పుణేలోని జంగ్లీ మహారాజ్ రోడ్డు(JM రోడ్). దీనిని 1976లో ‘రెకాండో’ అనే నిర్మాణ సంస్థ నిర్మించింది. అధిక నాణ్యత గల పదార్థాలు, సాంకేతికత వాడటంతో 10ఏళ్ల గ్యారెంటీ కూడా ఇచ్చింది. ఇంత నాణ్యమైన రోడ్డు నిర్మించిన ఆ సంస్థకు మరో కాంట్రాక్ట్ ఇవ్వలేదట.
News September 15, 2025
రైలు ప్రయాణికులకు బిగ్ అలర్ట్

సాధారణ రిజర్వేషన్ టికెట్లకూ ఆధార్ అథెంటికేషన్‌ను తప్పనిసరి చేస్తూ భారత రైల్వే బోర్డు నిర్ణయం తీసుకుంది. రైలు బుకింగ్స్ ఓపెన్ అయిన తొలి 15నిమిషాలు కేవలం ఆధార్ వెరిఫైడ్ యూజర్లు మాత్రమే IRCTC లేదా అధికారిక యాప్‌లో టికెట్లు బుక్ చేసుకొనే వీలుంటుంది. OCT 1 నుంచి ఇది అమల్లోకి రానుంది. ఇటీవల తత్కాల్ బుకింగ్స్‌కు ఈ విధానాన్ని ప్రవేశపెట్టగా తాజాగా సాధారణ రిజర్వేషన్లకూ వర్తింపజేయనుంది. SHARE IT.
News September 15, 2025
భారీగా తగ్గిన స్విఫ్ట్ కారు ధర

GST సంస్కరణల నేపథ్యంలో మారుతీ సుజుకీ తమ కార్ల ధరలను తగ్గించింది. స్విఫ్ట్ కారు ధర వేరియంట్స్‌ను బట్టి రూ.55 వేల నుంచి గరిష్ఠంగా రూ.1.06లక్షల వరకు తగ్గింది. దీంతో బేసిక్ వేరియంట్ రేట్(ఎక్స్ షోరూం) రూ.5.94 లక్షలకు చేరింది. ఆల్టో కే10 ప్రారంభ ధర రూ.2.77 లక్షలు, ఎస్-ప్రెస్సో రేట్ రూ.3.90 లక్షలు, వాగన్R ధర రూ.5.26 లక్షలు, డిజైర్ రేట్ రూ.6.24 లక్షలకు తగ్గింది. ఈ ధరలు ఈనెల 22 నుంచి అమల్లోకి రానున్నాయి.