News May 13, 2024

10 లక్షల మంది యువ ఓటర్లు

image

AP: ఈ సారి రాష్ట్రంలో కొత్త ఓటర్లు భారీ సంఖ్యలో ఉన్నారు. 18-19 ఏళ్ల వారు 10,30,616 మంది ఉన్నారు. వీరు తొలిసారి ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో 5.68 లక్షల మంది యువకులు, 4.62 లక్షల మంది యువతులు ఉన్నారు. అభ్యర్థుల తలరాతను వీరు మార్చబోయే అవకాశం ఉంది.

Similar News

News February 1, 2026

IISER తిరుపతిలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్

image

AP: తిరుపతిలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ <>(IISER<<>>)లో 22 నాన్ టీచింగ్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి BE, B.Tech, డిప్లొమా, MBBS, MD, PG, MSc, MCA, BS-MS, M.LSc, BSc ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. స్క్రీనింగ్/స్కిల్ టెస్ట్/రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.iisertirupati.ac.in

News February 1, 2026

మాఘ పౌర్ణమి: అద్భుత ఫలితాలనిచ్చే పుణ్యకార్యాలు

image

నేడు చేసే చిన్న సత్కార్యం కూడా కోటి రెట్ల ఫలితాన్నిస్తుంది. ఈరోజు గంగమ్మను, నారాయణుడిని స్మరిస్తూ పితృ తర్పణాలు వదలడం శుభప్రదం. దానధర్మాలకు కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది. నువ్వులు, రేగి పండ్లు, అన్నదానం చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది. అలాగే, సాయంత్రం వేళ సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించడం వల్ల కష్టాలు తొలగి సంపదలు కలుగుతాయి. ఈ పవిత్ర దినాన చేసే జప, హోమాలు సర్వ పాపాలను హరించి మోక్షాన్ని ప్రసాదిస్తాయి.

News February 1, 2026

ప్రెగ్నెన్సీలో ఎంతసేపు పడుకోవాలంటే?

image

ప్రెగ్నెన్సీలో తల్లికి 7-9 గంటల నిద్ర అవసరమని నిపుణులు చెబుతున్నారు. అలాగే పడుకోవడానికి వీలుగా పిల్లో వాడాలని సూచిస్తున్నారు. మంచి నిద్ర కోసం మసాలాలున్న ఆహారాలు, కెఫీన్ వంటివి తగ్గించాలి. ఎలక్ట్రానిక్ పరికరాలను నిద్రకు ముందు చూడకపోవడమే మంచిది. కనీసం ఒక గంట ముందు స్క్రీన్ కు దూరంగా ఉండాలి. ముఖ్యంగా ఎడమ వైపుకు తిరిగి పడుకోవడం వల్ల గర్భాశయానికి తగినంత రక్తం, పోషకాలు అందుతాయని చెబుతున్నారు.