News September 23, 2024

పుష్పక్ బస్సుల్లో వెళ్లే వారికి 10శాతం డిస్కౌంట్

image

AP: హైదరాబాద్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు పుష్పక్ బస్సుల్లో వెళ్లేవారికి టీజీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. వారి కోసం బస్సు టికెట్ ధరలో 10 శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్లు ప్రకటించింది. ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది కలిసి గ్రూప్‌గా వెళ్తే వారికి అదనంగా మరో 10 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు తెలిపింది.

Similar News

News January 5, 2026

ESIC నవీ ముంబైలో ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

<>ESIC <<>>నవీ ముంబైలో 7 సర్జన్, మెడికల్ ఆఫీసర్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. పోస్టును బట్టి ఎంబీబీఎస్, పీజీ/పీజీ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 69ఏళ్లు. జనవరి 6న ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. సర్జన్‌కు నెలకు రూ.1,0,0,600, మెడికల్ ఆఫీసర్‌కు రూ.85వేలు చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://esic.gov.in

News January 5, 2026

సెంచరీలు బాదడంలో ఇతని ‘రూటే’ సపరేటు!

image

ఇంగ్లండ్ ప్లేయర్ జో రూట్ టెస్టుల్లో నీళ్లు తాగినంత ఈజీగా సెంచరీలు బాదుతున్నారు. 2021 నుంచి అతను ఏకంగా 24 శతకాలు కొట్టడమే దీనికి నిదర్శనం. రూట్ తర్వాత ప్లేస్‌లో నలుగురు ప్లేయర్లు ఉండగా, వారిలో ఒక్కొక్కరు చేసిన సెంచరీలు 10 మాత్రమే. ఈ ఫార్మాట్ ఆడుతున్న యాక్టివ్ ప్లేయర్లలో సచిన్ టెస్ట్ సెంచరీల(51) రికార్డును బద్దలు కొట్టే సత్తా ప్రస్తుతం రూట్‌కే ఉంది. తాజాగా యాషెస్‌లో ఆయన 41వ సెంచరీ సాధించారు.

News January 5, 2026

అమెరికా దాడిలో మదురో సెక్యూరిటీ టీమ్ క్లోజ్!

image

వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను బంధించే క్రమంలో అమెరికా సైన్యం జరిపిన ఆపరేషన్ పెను విధ్వంసానికి దారితీసింది. ఈ దాడిలో మదురో సెక్యూరిటీ టీమ్‌లో మెజారిటీ సభ్యులు చనిపోయినట్లు ఆ దేశ రక్షణ మంత్రి పాడ్రినో సంచలన ప్రకటన చేశారు. US బలగాలు ‘కోల్డ్ బ్లడెడ్’గా తమ సైనికులు, అమాయక పౌరులను పొట్టనబెట్టుకున్నాయని ఆరోపించారు. తమ నేతను వెంటనే విడుదల చేయాలని వెనిజులా సైన్యం డిమాండ్ చేసింది.