News October 8, 2025
10 పోస్టులు.. అప్లై చేసుకోండి

నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్‌లో 4 మేనేజర్ పోస్టులకు దరఖాస్తు చేయడానికి ఈనెల 31 ఆఖరు తేదీ. ఎంబీఏ, పీజీడీబీఎం, పీజీడీఏ, బీఎస్సీ, ఎమ్మెస్సీతో పాటు పనిఅనుభవం గల వారు అప్లై చేసుకోవచ్చు. వెబ్‌సైట్:https://careers.nfl.co.in/
*ఐఐటీ గువాహటి 6 అసోసియేట్ ప్రాజెక్ట్ సైంటిస్టు పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తిగలవారు ఈ నెల 15వరకు అప్లై చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ ద్వారా వీటిని భర్తీ చేయనున్నారు.
Similar News
News March 5, 2026
సుఖోయ్ యుద్ధ విమానం మిస్సింగ్!

అస్సాంలో సుఖోయ్ Su-30 MKI యుద్ధ విమానం గల్లంతయింది. జోర్హాట్ నుంచి టేకాఫ్ అయిన జెట్ 7.42PM సమయంలో రాడార్ నుంచి కాంటాక్ట్ కోల్పోయింది. పైలట్ కూడా మిస్ అయినట్లు రక్షణ శాఖ అధికారులు చెప్పారు. IAF సెర్చ్, రెస్క్యూ ఆపరేషన్ చేపట్టినట్లు తెలిపారు. అయితే ఫైటర్ జెట్ కూలిపోయిందని వార్తలు వస్తున్నాయి.
News March 5, 2026
3 వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్

T20WC: 254 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ తడబడుతోంది. 6 ఓవర్లలో 68 రన్స్ చేసి 3 వికెట్లు కోల్పోయింది. సాల్ట్ 5, బట్లర్ 25, బ్రూక్ 7 రన్స్ చేసి ఔటయ్యారు. బెథెల్ (26*), బాంటన్ (4*) క్రీజులో ఉన్నారు. ఇంగ్లండ్ విజయానికి 84 బంతుల్లో 186 రన్స్ కావాలి. మరి ఈ మ్యాచులో ఎవరు గెలుస్తారో కామెంట్ చేయండి.
News March 5, 2026
US దాడి చేస్తే ఇండియాపై నిందలేంటి: అమిత్ మాలవీయ

ఇరాన్ నౌకపై అమెరికా దాడి చేస్తే ఇండియాను నిందించడంలో లాజిక్ లేదని BJP నేత అమిత్ మాలవీయ విమర్శించారు. ‘భారత తీరానికి 250 నాటికల్ మైళ్ల దూరంలో, సముద్ర పరిధికి అవతల అటాక్ జరిగింది. సమీపంలో ఉన్నంత మాత్రాన ప్రతి ఘటనకు ఆ దేశం బాధ్యత వహించదు. అంతర్జాతీయ జలాల్లో కార్యకలాపాలను IND నియంత్రించదు. US-ఇరాన్ మధ్య జరిగిన దానికి ఇండియాను జవాబుదారీగా చేయాలనుకోవడం సమర్థనీయం కాదు’ అని ట్వీట్ చేశారు.


