News July 17, 2024
ఉద్యోగాల్లో అగ్నివీర్‌లకు 10% రిజర్వేషన్లు: హరియాణా ప్రభుత్వం

సైన్యంలో పని చేసే అగ్నివీర్‌లకు పలు ప్రభుత్వ ఉద్యోగాల్లో 10% రిజర్వేషన్లు కల్పించనున్నట్లు హరియాణా CM నాయబ్ సైనీ ప్రకటించారు. కానిస్టేబుల్, మైనింగ్ గార్డ్, ఫారెస్ట్ గార్డ్, జైల్ వార్డెన్ నియామకాల్లో రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు తెలిపారు. కాగా ఇప్పటికే కానిస్టేబుల్ నియామకాల్లో CISF, BSF, CRPF వంటి కేంద్ర సంస్థల్లో అగ్నివీర్‌లకు 10% రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే.
Similar News
News April 10, 2026
మొజ్తబా సంచలన ప్రకటన

హార్ముజ్ జలసంధిపై ఎవరి నియంత్రణా ఉండొద్దని ట్రంప్ చెబుతున్న వేళ ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా సంచలన ప్రకటన చేశారు. ఆ జలసంధి నిర్వహణను మరో దశకు తీసుకెళ్తామన్నారు. తమపై దాడి చేసిన వారిని వదిలేది లేదని స్పష్టం చేశారు. తన తండ్రి అయతుల్లా ఖమేనీ మరణానికి, అమరవీరుల త్యాగాలకు ప్రతీకారం తీర్చుకుంటామని తెలిపారు. యుద్ధంతో జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
News April 10, 2026
ఆ బాధతో రోజూ ఫుల్ బాటిల్ తాగేవాడిని: ఆమిర్

తనను ఒంటరిగా వదిలి మొదటి భార్య రీనా దత్తా ఇద్దరు పిల్లలతో ఇంటి నుంచి వెళ్లిపోయినప్పుడు తీవ్రంగా కుంగిపోయానని ఆమిర్ ఖాన్ తెలిపారు. ఎమోషన్లను అదుపు చేసుకోలేక ఏడాదికిపైగా రోజూ ఒక ఫుల్ బాటిల్ మద్యం తాగేవాడినని ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు. ఈ ఘటనకు ముందు తనకు లిక్కర్ అలవాటు లేదన్నారు. రీనాతో 2002లో, కిరణ్ రావుతో 2021లో ఆమిర్ డివోర్స్ తీసుకొన్నారు. ప్రస్తుతం గౌరీతో రిలేషన్‌లో ఉన్నారు.
News April 10, 2026
కన్నింగ్ పాక్ మధ్యవర్తిత్వం.. పరిష్కారం లభించేనా?

పాక్ వేదికగా US-ఇరాన్ మధ్య శాంతి చర్చలు ఇవాళ ప్రారంభం కానున్నాయి. హార్ముజ్‌పై నియంత్రణ, ఇరాన్ అణు కార్యక్రమంపై ఇరు పక్షాలు పట్టుబట్టే అవకాశం ఉంది. US ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ పాల్గొంటారు. అయితే నిలకడ లేని అమెరికా, టెంపరమెంట్‌తో ఊగిపోయే ఇరాన్ మధ్య కన్నింగ్ పాకిస్థాన్ చేస్తున్న మధ్యవర్తిత్వం ఫలితాన్నిస్తుందా లేక మధ్యలోనే ఆగిపోతుందా? అనేది కాలమే నిర్ణయించనుంది.


