News September 2, 2024
వరద బాధితులకు రూ.10 వేల తక్షణ సాయం: CM
TG: ఖమ్మంలో వరదలు బాధాకరమైన సందర్భమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇళ్లు దెబ్బతిన్నవారికి తక్షణ సాయంగా రూ.10 వేలు ఇవ్వాలని కలెక్టర్‌ను ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఆయన మాట్లాడారు. నష్టంపై అధికారులు అంచనా వేసి నివేదికలు ఇస్తే అనుగుణంగా పరిహారం ఇస్తామని చెప్పారు. సర్టిఫికెట్లు కోల్పోయిన వారికి కొత్తవి ఇచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందన్నారు.
Similar News
News February 2, 2025
U19 T20 WC ఫైనల్: టీమ్ ఇండియా బౌలింగ్
ICC ఉమెన్స్ U19 T20 WC ఫైనల్‌లో సౌతాఫ్రికా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
IND: కమలిని, G త్రిష, సానికా చల్కే, నికి ప్రసాద్(C), ఈశ్వరి, మిథిల, ఆయుషి శుక్లా, జోషిత, షబ్నాం, పరుణికా, వైష్ణవి.
SA: జెమ్మా బోథా, లౌరెన్స్, డయారా, ఫే కౌలింగ్, కైలా(C), కరాబో మెసో, మైకే వాన్, షెష్నీ నాయుడు, ఆష్లీ వాన్ వైక్, మోనాలిసా, నిని.
LIVE: హాట్‌స్టార్, స్టార్ స్పోర్ట్స్
News February 2, 2025
బాత్రూమ్‌లో బిడ్డను కని చెత్తకుండీలో విసిరేసిన విద్యార్థిని
తమిళనాడులో అమానుష ఘటన జరిగింది. తంజావూర్ ప్రభుత్వ మహిళా కళాశాలలో చదువుతున్న ఓ విద్యార్థిని కాలేజీ బాత్రూమ్‌లో బిడ్డను ప్రసవించింది. యూట్యూబ్ సాయంతో బొడ్డు పేగు కోసి ఆ పసిప్రాణాన్ని చెత్తకుండీలో విసిరేసి క్లాస్ రూంకు తిరిగొచ్చింది. దుస్తులకు రక్తస్రావాన్ని గుర్తించిన తోటి విద్యార్థినులు లెక్చరర్లకు చెప్పడంతో వారు ఆస్పత్రికి తరలించారు. వైద్యులు బిడ్డను తీసుకొచ్చి బతికించారు.
News February 2, 2025
కోటి మందే కానీ.. దేశ ఆదాయానికి వారే కీలకం
మన దేశ జనాభా 140 కోట్ల పైనే. అందులో ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసింది 7.5 కోట్ల మందే (FY 2024-25). ఇందులో 6.5 కోట్ల మంది ఆదాయం రూ.12 లక్షల కంటే తక్కువే. కోటి మందే రూ.12 లక్షల కంటే ఎక్కువ ఆదాయం కలిగి ఉండి ఆదాయపు పన్ను కడుతున్నారు. కానీ వీరు దేశ ఆదాయానికి ఎక్కువ నిధులు సమకూరుస్తున్నారు. అప్పుల ద్వారా ఖజానాకు 24 % వాటా వస్తే.. ఆదాయపు పన్ను ద్వారా 22% వస్తోందని ప్రభుత్వం వెల్లడించింది.