News April 27, 2024
‘100% కేసుల పరిష్కారం దిశగా న్యాయ వ్యవస్థ’

తెలంగాణలో 100% కేసుల పరిష్కారం దిశగా న్యాయ వ్యవస్థ ముందుకు సాగుతున్నదని రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే అన్నారు. శనివారం NLGలో నూతనంగా నిర్మించిన అధునాతన 5 కోర్టుల భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లా కోర్టులో నూతనంగా నిర్మించిన 5 కోర్టుల అధునాతన భవనంలో డిజిటలైజేషన్ తో పాటు, అన్ని రకాల సౌకర్యాలను కల్పించడం జరిగిందన్నారు.
Similar News
News December 3, 2025
ఎన్ని నామినేషన్లు వచ్చాయి?ఎన్ని రిజక్ట్ చేశారు?: ఇలా త్రిపాఠి

నామినేషన్ పత్రాల పరిశీలనను నిబంధనలకు అనుగుణంగా, పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి చెప్పారు. బుధవారం ఆమె నిడమనూరు, ముకుందాపురం గ్రామపంచాయతీలలో నామినేషన్ల పరిశీలన కార్యక్రమాన్ని పరిశీలించారు. ఎన్ని నామినేషన్లు వచ్చాయని ? ఎన్ని రిజక్ట్ చేశారని? అధికారులతో అడిగి తెలుసుకున్నారు. కుల ధ్రువీకరణ పత్రాలు, బ్యాంక్ అకౌంట్ బుక్స్పై ఆరా తీశారు.
News December 3, 2025
బంగారిగడ్డ ఎన్నికలు.. ఫిర్యాదుతో యథావిధిగా పోలింగ్

చండూరు మండలం బంగారిగడ్డ గ్రామ పంచాయతీలో సర్పంచ్ ఎన్నిక వివాదాస్పదమైంది. అభ్యర్థిని ఏకగ్రీవంగా నిర్ణయించినా, కొందరు వ్యక్తులు రాష్ట్ర ఎన్నికల కమిషనర్కు ఫిర్యాదు చేశారు. దీంతో ఎన్నికలను యథావిధిగా నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. బుధవారం బరిలో నిలిచిన అభ్యర్థులకు గుర్తులను ఎంపిక చేసినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి శ్రీనివాస్ పేర్కొన్నారు. త్వరలో పోలింగ్ నిర్వహించనున్నారు.
News December 3, 2025
దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రజావాణి: కలెక్టర్

దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. బుధవారం ఆమె నల్గొండ జిల్లా కేంద్రంలోని మేకల అభినవ్ స్టేడియంలో దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన క్రీడా పోటీల ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లాలో దివ్యాంగులకు నిర్వహించిన క్రీడా పోటీలలో దివ్యాంగులు క్రీడా స్ఫూర్తితో ఆడారని అన్నారు.


