News September 29, 2024

100 జిల్లాల్లో విజయనగరానికి స్థానం

image

కేంద్ర ప్ర‌భుత్వం చేప‌డుతున్న‌ జ‌న్ జాతీయ ఉన్న‌త్ గ్రామ్ అభియాన్ ప‌థ‌కాన్ని ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడి అక్టోబ‌రు 2న ఆన్‌లైన్ వర్చువల్‌గా ప్రారంభించ‌నున్న‌ట్లు క‌లెక్ట‌ర్ అంబేద్క‌ర్ ఆదివారం తెలిపారు. ఆదిమ గిరిజ‌న తెగ‌ల వారు నివ‌సించే దేశంలోని 100 జిల్లాల్లో ఈ కార్య‌క్ర‌మాన్ని చేప‌డుతున్నారు. అందులో విజ‌య‌న‌గ‌రం జిల్లా కూడా ఉన్న‌ట్టు పేర్కొన్నారు.

Similar News

News October 5, 2024

VZM: నేషనల్ టీంకు ఎంపికైన వ్యవసాయ కూలీ కొడుకు

image

అక్టోబర్‌లో జమ్మూ కాశ్మీర్‌లో జరగనున్న నేషనల్ ఫుట్ బాల్ గేమ్స్‌కు కొత్తవలస మండలం వీరభద్రపురం గ్రామానికి చెందిన చింతాడ రాజేశ్ ఎంపికయ్యాడు. గుంటూరులో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి రాజేవ్ ఏపీ టీం తరఫున జాతీయస్థాయి ఆడనున్నాడు. గతంలో 3 సార్లు జాతీయస్థాయి పోటీల్లో పాల్గొన్నాడు. తండ్రి అప్పారావు, తల్లి లక్ష్మీ వ్యవసాయ కూలీలుగా పనిచేస్తున్నారు.

News October 4, 2024

VZM: పైడితల్లి హుండీ ఆదాయం రూ.10.54 లక్షలు

image

శ్రీ పైడితల్లి అమ్మవారి హుండీల ఆదాయం గత 29 రోజులకు గాను రూ.10,54,690, బంగారం 125.100 గ్రాములు వచ్చింది. గురువారం రెండు ఆలయాల హుండీలను అమ్మవారి కళ్యాణ మండపంలో లెక్కించారు. వెండి 131 గ్రాములు వచ్చినట్లు ఈవో ప్రసాదరావు తెలిపారు. హుండీ లెక్కింపులో పాత రూ.2వేల నోట్లు, రూ.500 నోట్లు, నకిలీ నోట్లు దర్శనమిచ్చాయి. హుండీలో ఇలాంటి నోట్లు వేయకూడదని ఈవో సూచించారు.

News October 4, 2024

VZM: పవన్ ప్రసంగం కోసం LED స్క్రీన్

image

పవన్ కళ్యాణ్ వారాహి డిక్లరేషన్ ప్రసంగాన్ని కోట జంక్షన్‌లో గురువారం రాత్రి LED స్క్రీన్ ద్వారా ప్రజలు వీక్షించారు. తిరుపతిలో జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రసంగాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు జనసేన పార్టీ నాయకులు అవనాపు విక్రమ్, అవనాపు భావన దంపతులు భారీ LED స్క్రీన్ ఏర్పాటు చేశారు. దీంతో ప్రజలు, జనసైనికులు, నాయకులు ప్రత్యక్షంగా తిలకించారు.