News August 29, 2024
100 బిలియన్ ఎకానమీగా విశాఖను అభివృద్ధి చేస్తాం: మంత్రి లోకేశ్

మెరుగైన ఐటీ పాలసీతో ప్రఖ్యాత ఐటీ పరిశ్రమలను ఏపీకి రప్పిస్తామని మంత్రి లోకేశ్ వెల్లడించారు. గురువారం ఆయన ఓ హోటల్లో ఐటీ ప్రముఖులతో సమావేశమయ్యారు. 100 బిలియన్ ఎకానమీగా విశాఖ మహానగరాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. గ్రీన్ ఛానల్ ద్వారా ఐటీ పరిశ్రమలకు రాయితీలను అందజేస్తామన్నారు. ఐటీలో ఎంత ఎక్కువ ఉద్యోగాలిస్తే అంత మెరుగైన ప్రోత్సాహకాలు అందజేయనున్నట్లు వెల్లడించారు. ఐటీ పరిశ్రమలు సహకరించాలని కోరారు.
Similar News
News October 28, 2025
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో విశాఖ కలెక్టర్ పర్యటన

విశాఖలోని మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ పర్యటించారు. కైలాసపురం, శాంతి నగర్, కస్తూరి నగర్, మాధవధార అంబేద్కర్ కాలనీలో కొండచరియలు ఇళ్లపై పడడంతో పరిస్థితిని సమీక్షించారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని, దెబ్బతిన్న ఇల్లు వెంటనే ఖాళీ చేయాలని సూచించారు. ఎప్పటికప్పుడు పరివేక్షణ చేయాలని అధికారులను ఆదేశించారు.
News October 28, 2025
విశాఖ: తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తుగా రేషన్

విశాఖ జిల్లాలోని తుఫాను ప్రభావిత ప్రాంతాలలో ముందస్తుగా అంటే మంగళవారం నుంచి రేషన్ సరుకులు పంపిణీ చేస్తున్నారు. అధికారుల ఆదేశాల మేరకు నవంబర్ నెలకు సంబంధించిన రేషన్ సరుకులు ముందస్తుగానే అందజేస్తున్నారు. ఇప్పటికే పాత డెయిరీ ఫారం ఆదర్శనగర్ ప్రాంతాల్లో రేషన్ డీలర్లు సరుకులు పంపిణీ చేస్తున్నారు. స్టాక్ అంతా ఇప్పటికే రేషన్ షాపులకు చేరుకుంది.
News October 28, 2025
విశాఖ రానున్న మంత్రి గొట్టిపాటి

రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మంగళవారం సాయంత్రం నగరానికి రానున్నారు. తాడేపల్లి నుంచి రోడ్డు మార్గంలో రాజమండ్రి చేరుకున్నారు. అక్కడి నుంచి ఒంటిగంటకు బయలుదేరి సాయంత్రం 4 గంటలకు నగరానికి చేరుకోనున్నారు. అనంతరం నగరంలోని పలు కార్యక్రమాలలో పాల్గొనున్నారు. తుఫాన్ నేపథ్యంలో అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి మెరుగైన సేవలు అందించేందుకు మంత్రి దిశానిర్దేశం చేయనున్నారు.


