News May 11, 2024
100 శాతం భద్రత చర్యలు: సైబరాబాద్ సీపీ

లోక్‌సభ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా 100% భద్రతా చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలు స్వేచ్ఛగా ఓటేసేలా భరోసా కల్పిస్తున్నామని సీపీ అవినాష్ మహంతి అన్నారు. పోలింగ్ రోజు కట్టుదిట్టమైన బందోబస్తు ఉంటుందన్నారు. అక్రమ నగదు, మద్యం ఉచిత స్వాధీనాల్లో సైబరాబాద్ రాష్ట్రంలోనే తొలి స్థానంలో ఉందన్నారు. మొత్తం 6 వేల మంది పోలీసులు, 13 కంపెనీల కేంద్ర బలగాలు, 850 మంది శిక్షణ కానిస్టేబుళ్లు, SIలు విధుల్లో ఉంటారన్నారు.
Similar News
News April 16, 2026
RR: హీట్ వేవ్.. ఇవి తప్పని సరి: DMHO

RR జిల్లాలో తీవ్ర ఎండల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యాధికారి డా. లలితాదేవి సూచించారు. మజ్జిగ, కొబ్బరినీళ్లు, ORS తీసుకోవాలని, మ.12 నుంచి సా.4 వరకు బయటకు వెళ్లొద్దని హెచ్చారించారు. తేలికపాటి కాటన్ దుస్తులు ధరించాలి. పిల్లలు, వృద్ధులు, గర్భిణులు జాగ్రత్తగా ఉండాలి. హీట్ స్ట్రోక్ లక్షణాలు కనిపిస్తే వెంటనే చల్లని ప్రదేశానికి తరలించి అవసరమైతే 108కు సమాచారం ఇవ్వాలని సూచించారు.
News April 16, 2026
RR: మండుతున్న ఎండలు.. ఇవి తప్పనిసరి

రంగారెడ్డి జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. దీంతో డీ హైడ్రేషన్‌కు లోనయ్యే ప్రమాదం ఉందని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డా.లలితాదేవి తెలిపారు. సాధ్యమైనంత వరకు మ.12 గం. నుంచి 4 వరకు బయట తిరగక పోవడమే ఉత్తమమని, అనివార్యమైతే వెంట గొడుగు, వాటర్ బాటిల్ తీసుకెళ్లాలని సూచించారు
News April 14, 2026
రంగారెడ్డిలో 40 దాటింది.. జాగ్రత్త!

రంగారెడ్డిలో ఎండలు భగ్గుమంటున్నాయి. ఇబ్రహీంపట్నం పరిధి దండుమైలారంలో గరిష్ఠంగా 41.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మాడ్గుల్, ఎలిమినేడు ప్రాంతాల్లో 41.7 డిగ్రీలు, బోడకొండ, రాచులూరు ప్రాంతాల్లో 41.6 డిగ్రీలు నమోదయ్యాయి. యాచారం, మొయినాబాద్, కడ్తాల్ ప్రాంతాల్లో కూడా 41 డిగ్రీల పైగా ఉష్ణోగ్రతలు నమోదవడంతో వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఎండలో బయటకు వెళ్లకపోవడం మంచిదని నిపుణులు సూచించారు.
SHARE IT


