News March 26, 2025

100% ఈకేవైసీ పూర్తిచేయాలి: జేసీ సూరజ్

image

రేషన్ లబ్దిదారులు ఈకేవైసీ ప్రక్రియను సత్వరమే పూర్తిచేయాలని, జిల్లాలోని అందరూ పౌరసరఫరాల డిప్యూటీ తహశీల్దార్‌లను జిల్లా జాయింట్ కలెక్టర్ సూరజ్ ఆదేశించారు. ఈ ప్రక్రియను 100% పూర్తిచేయాలన్నారు. వార్డు సచివాలయాల్లో, రేషన్ షాపులలో డీలర్ వద్ద ఉన్న ఈ-పాస్ పరికరాలు మొబైల్ యాప్ ద్వారా ఈకేవైసీ అప్డేట్ చేసుకోవచ్చన్నారు. 5 సంవత్సరాల లోపు పిల్లలు మినహా, మిగిలిన వారు ఈ కేవైసీ పూర్తి చేయాలన్నారు. 

Similar News

News July 5, 2025

కల్వకుర్తిలో 13.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు

image

నాగర్‌కర్నూల్ జిల్లా వ్యాప్తంగా గత 24 గంటలలో నమోదైన వర్షపాతం వివరాలను వాతావరణ శాఖ అధికారులు శనివారం ప్రకటించారు. కల్వకుర్తిలో 13.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా తిమ్మాజీపేట మండలంలో 11.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. నాగర్ కర్నూల్‌లో 4.4, ఊరుకొండలో 4.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు పేర్కొన్నారు. జిల్లాలోని మిగతా ప్రాంతాలలో అతి తక్కువ వర్షపాతం నమోదైనట్లు తెలిపారు.

News July 5, 2025

సంగారెడ్డి: ‘పాఠ్యపుస్తకాల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలి’

image

సంగారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు అందచేసిన పాఠ్యపుస్తకాలు, యూనిఫాంల వివరాలను ఆన్లైన్‌లో నమోదు చేయాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు ఆదేశించారు. డీఈవో మాట్లాడుతూ.. నమోదు చేయని పాఠశాలలపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రధానోపాధ్యాయులు గమనించాలని సూచించారు.

News July 5, 2025

మనోళ్ల తెలివితో విదేశాలు అభివృద్ధి!

image

IIT గ్రాడ్యుయేట్లలో 35% మంది విదేశాల్లో సెటిల్ అవుతున్నారని తాజాగా ఓ నివేదికలో వెల్లడైంది. దీని ప్రకారం మిగిలిన 65% మందిలో అధికులు మన దేశంలోని గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి MNC కంపెనీల్లో పనిచేస్తున్నారు. అలాగే టాప్-100 JEE ర్యాంకులు సాధించిన వారిలో 62మంది అమెరికా/యూరప్‌లో సెటిల్ అయ్యేందుకు ఇష్టపడుతున్నారు. కానీ 2-3% మంది మాత్రమే DRDO, ISRO, BARC వంటి ప్రభుత్వరంగ సంస్థల్లో పనిచేస్తున్నారు.